రాష్ట్రీయం

నేటినుంచి రొట్టెల పండుగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తింపు పొంది, కుల మతాలకతీతంగా వచ్చే భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యస్థలంగా ప్రసిద్ధికెక్కిన నెల్లూరు బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ నేటినుంచి ప్రారంభం కానుంది. ఈ ఉత్సవాన్ని నాలుగు రోజులపాటు నిర్వహిస్తారు. గతేడాది 7 లక్షల మంది వరకూ భక్తులు రాగా ఈ ఏడాది 10 లక్షల వరకు వచ్చే అవకాశముందని నిర్వాహకులు, అధికారులు భావిస్తున్నారు. పండుగ శుక్రవారం నుండి ప్రారంభం కానుండగా గురువారం నుండి దర్గాకు భక్తుల తాకిడి ఎక్కువైంది. దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు మార్చుకొని స్వీకరించడం ద్వారా తాము కోరుకున్న కోర్కెలు తీరుతాయనే నమ్మకంతో వస్తుంటారు. గతేడాది తాము కోరిన కోర్కెలు తీరినవారు అదే కోరికలతో వచ్చేవారికి తమ రొట్టెలను అందించి తమకు అసరమైన ఇతర కోర్కెల రొట్టెలను స్వీకరిస్తుంటారు. లక్షల సంఖ్యలో వస్తున్న
భక్తులకోసం అధికారులు, నిర్వాహక కమిటీ భారీఎత్తున ఏర్పాట్లు చేసింది. 30ఏళ్ల కిందట ఒక్కరోజు మాత్రమే ఈ రొట్టెల పండుగ జరిగేది. భక్తుల రద్దీ పెరుగుతుండడంతో అయిదు రోజులపాటు నిర్వహించుకునే స్థాయికి పండుగ చేరుకుంది. పూర్వకాలంలో బియ్యం ఆకుకూరతో రొట్టెల పండుగ జరుపుకునేవారు. ప్రస్తుతం గోధుమ రొట్టెలు, బెల్లంతో భక్తులు పండుగను నిర్వహిస్తున్నారు. దర్గా పక్కన ఉన్న చెరువులో భక్తితో స్నానమాచరించి భక్తుల కోర్కెలు తీర్చే రొట్టె ఎక్కడ ఉందో విచారించి తీసుకుంటుంటారు. ఇంతటి ప్రశస్తి కలిగిన ఈ పండుగకు హాజరయ్యేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా కర్నాటక, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలతోపాటు ఇతర దేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. రాష్ట్రంలో లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ ఉత్సవాల్లో నెల్లూరు రొట్టెల పండుగకు ప్రత్యేక స్థానముంది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పలువురు మంత్రులు కూడా హాజరు కానుండడం విశేషం.

చిత్రం..నెల్లూరు స్వర్ణాల చెరువులో గురువారం రొట్టెలు మార్చుకుంటున్న భక్తులు