రాష్ట్రీయం

కామన్ అజెండాకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఎన్నికల నోటిఫికేషన్‌కు 15 రోజుల ముందు అభ్యర్థులను ప్రకటించనున్నట్టు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు శుక్రవారంతో గడువు ముగుస్తుందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి గెలుపు ఓటములపై రెండుసార్లు సర్వే నిర్వహించాకే ఎంపిక చేస్తామని ఆయన తెలిపారు. గాంధీభవన్‌లో గురువారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. సర్వే ఫలితాల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితాను పీసీసీ సంప్రదింపుల కమిటీ పరిశీలిస్తుందని అన్నారు. కాగా కాంగ్రెస్ మిత్రపక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయని ఉత్తమ్ పేర్కొన్నారు. కూటమిలో అన్ని పార్టీలు కామన్ (ఉమ్మడి) అజెండాకు అనుకూలత వ్యిక్తం చేసాయని ఆయన వెల్లడించారు. మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపుపై ఇంకా చర్చించాల్సి ఉందని, కాంగ్రెస్ సిట్టింగ్ సీట్లను మిత్రపక్షాలు కోరినట్టు తన దృష్టికి రాలేదని ఆయన వివరించారు. ఒకటి రెండు చోట్ల అలాంటి సమస్యలు ఎవైనా ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో తప్పుల తడకలు, ఓట్ల తొలగింపుపై ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కాస్త అయోమయంలో పడినట్టు ఉందన్నారు.
పార్టీలో కోవర్టులు: వీహెచ్
కాంగ్రెస్ పార్టీలో కొందరు సీఎం కేసీఆర్ కోవర్టులు ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఆరోపించారు. కోవర్టుల వివరాలను పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి చెబుతానన్నారు. హైదరాబాద్‌లోనే ఉన్న గులాంనబీ అజాద్‌ను గురువారం కలిసిన వీహెచ్ తనను ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించకపోవడం పట్ల అంసతృప్తి వ్యక్తం చేశారు. స్ట్రాటజీ కమిటీ చైర్మన్‌గా చేసేది ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. పార్టీలోని కేసీఆర్ కోవర్టులకు తాను ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉంటే పప్పులు ఉడకవనీ భయపడుతున్నారని విమర్శించారు. గతంలో తాను ప్రచార కమిటీ చైర్మన్‌గా ఉండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చానని ఆజాద్‌కు తెలిపారు.