రాష్ట్రీయం

బ్రోకర్లను నియమిస్తారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కాంగ్రెస్ ఎన్నికల కమిటీల నియామకాలపై పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ‘గాంధీ భవన్‌లో తిరిగే బ్రోకర్లకు, పలు నేరాలపై జైలుకు వెళ్లిన నేతలకు అధిక ప్రాధాన్యత ఇస్తారా?’ అంటూ నిప్పులు చెరిగారు. గురువారం హైదరాబాద్ నగర శివారులో ఏర్పాటు చేసిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్ రెడ్డి పీసీసీ కమిటీల నియామకాలపై ఆయన మండిపడ్డారు. నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి, జైలుకు వెళ్లొచ్చిన నేతలకు పదవులు ఇవ్వడమేటని పరోక్షంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి నిలదీశారు. గాంధీ భవన్‌లో తిరిగే బ్రోకర్లకు, టీవీలు. పేపర్లలో మాట్లాడేవారికి కమిటీలలో స్థానం కల్పించారని ఆరోపించారు. ప్రజల మధ్య తిరిగే నాయకులకు స్థానం కల్పించకపోవడం దారుణమని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కోమటి రెడ్డి బ్రదర్స్ అవసరమా..? లేదా అనేది కాంగ్రెస్ తేల్చుకోవాలని సవాల్ విసిరారు. తెలంగాణకు రామచంద్ర కుంతియా ఒక శనిలాగా తయారు అయ్యరని రాజగోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘నేను కుంతియాకు భయపడాల. నేను ఇవరికీ భయపడను. ఇలాంటి కుంతియాలు వంద మంది వచ్చిన నాకు భయం లేదు’అని ఆయన తీవ్ర స్వరంతో అన్నారు. ‘కోమటి రెడ్డి బ్రదర్స్‌ను ప్రజలు కోరుకుంటున్నారు. మీరు మాత్రం మమ్మల్ని పక్కన పెడుతున్నారు. కోమటి రెడ్డి బ్రదర్స్ కాంగ్రెస్‌కు అవసరం లేదా’అని ఆయన నిలదీశారు. వార్డు మెంబర్‌గా గెలవని వ్యక్తులకు కమిటీలో స్థానం ఇచ్చి, తమను ఇంట్లో కూర్చోబెడతారా అంటూ నిప్పులు చెరిగారు. గెలిచే అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలే తప్ప పైరవీ కారులకు, బ్రోకర్లకు కాదని అధినాయకత్వాన్ని హెచ్చరించారు. ఏ విషయమైన నిర్మొహటంగా మాట్లాడే వ్యక్తులమని, తాము నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసమే బతుకున్నామని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.