రాష్ట్రీయం

అంగరంగ వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 20: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 8వ రోజైన గురువారం ఉదయం 7.30 నుంచి 9.30 గంటల వరకు ఉభయదేవేరులతో కూడిన శ్రీ మలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. తిరుమలలో రథోత్సవం అన్ని విధాలా ప్రిసిద్ధమైంది. రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అనే ఆర్షవాక్కులు రథోత్సవం మోక్ష ప్రదాయకమని వివరిస్తున్నాయి. రథోత్సవానికి విశిష్టమైన ఆధ్యాత్మికార్థం ఉంది. కఠోపనిషత్తులో ఆత్మకూ శరీరానికి ఉండే సంబంధాన్ని రథరూపకల్పనతో వివరించడం జరిగింది. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సరాథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు. విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, సూక్ష్మ శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమనే ఆత్మానాత్మ వివేకం కలుగుతుంది. రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్త్వజ్ఞానమిదే. భక్తులు రథాన్ని లాగుతారు. కాని అన్నమయ్య సకల జీవులలో అంతర్యామిగా ఉన్న పరమాత్మ తన రథాన్ని తానే లాగుతున్నాడని అనడం సముచితంగా ఉంది. కాగా సాయంత్రం 6 నుంచి 7గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్, చిన్న జీయర్, టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, ధర్మకర్తల మండలి సభ్యులు సుధానారాయణ మూర్తి, రాయపాటి సాంబశివరావు, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు, ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం రాత్రి అశ్వవాహనంపై శ్రీమలయప్పస్వామి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేద పఠనంతో జీయంగార్ల బృందం ద్రవిడ వేద ప్రబంధం పఠిస్తుండగా, మేళతాళాలు, కళాకారుల ప్రదర్శనలు వాహన సేవ ముందు భక్తులను అలరించాయి.

చిత్రం..తిరుమల మాడ వీధుల్లో గురువారం రాత్రి అశ్వవాహన సేవ