రాష్ట్రీయం

మేమూ ఓటు వేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: రాష్ట్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కొత్త ఓటర్లు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ అవకాశాన్ని అందిపుచ్చుకుని లక్షల సంఖ్యలో తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. తాజాగా 18 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రజత్ కుమార్ వెల్లడించారు. సచివాలయంలో గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో పేర్ల సవరణ కోసం ఈ నెల 25 వరకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికే జాబితాలో పేర్లు ఉండి తాజా జాబితాలో పేర్లు లేకపోతే దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన విజ్ఞప్తి చేశారు. పేరు, తండ్రి పేరు, చిరునామా తదితర అంశాల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరణ కోసం అవకాశం ఈ నెల 25 వరకు ఉందన్నారు. కొత్తగా పేర్లు నమోదు చేయించుకునే వారు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఆ తర్వాత నామినేషన్ల గడువుకు ముందు 10 రోజుల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన వివరించారు. ఒకటి కన్నా ఎక్కువ చోట్ల పేర్లు ఉన్న ఓటర్లు దాదాపు 4.90 లక్షల మంది ఉన్నట్టు ప్రాథమిక పరిశీలనలో తేలిందని రజత్ కుమార్ తెలిపారు. ఈ పేర్లను పరిశీలించి ఒకే చోట పేరు ఉండేలా చూస్తామన్నారు. ఓటర్ల జాబితాల సవరణల కోసం 32, 574 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓ) పనిచేస్తున్నారని అన్నారు. కాగా ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించేందుకు 40 వేల వరకు ఈవీఎంలు అవసరం కాగా, 30,840 వచ్చాయని, అలాగే 44 వేల వీవీ ప్యాట్లు అవసరం కాగా 18,630 వచ్చాయన్నారు. ఇప్పటి వరకు 23 జల్లాలకు ఈవీఎంలను పంపించామన్నారు. ఈవీఎంలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా గ్రామాల్లో, పట్టణ ప్రాంతాల్లోనూ అవగాహన కల్పిస్తున్నట్టు కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం 120 మంది సీనియర్ అధికారులను ఢిల్లీ పంపించామని, వీరు జిల్లాలకు వెళ్లి శిక్షణ ఇస్తారన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) రజత్ కుమార్