రాష్ట్రీయం

ముమ్మూరు తలాక్‌ను వ్యతిరేకిస్తున్నాం: టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ముమ్మూరు తలాక్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయడం ఏకపక్షమని టీపీడీ ఏపీ శాసనమండలి సభ్యుడు ఎంఏ షరీఫ్ పేర్కొనగా, ముమ్మూరు తలాక్ ఆర్డినెన్స్‌ను సమర్థిస్తున్నట్టు బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి డాక్టర్ ఎస్ ప్రకాష్‌రెడ్డి, మరో అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌లు పేర్కొన్నారు. చట్టపరంగా చెల్లని మమ్మూరు తలాక్‌కు మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం అమానుషమని షరీఫ్ పేర్కొన్నారు. ఎంఐఎం నేతలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొనడం దారుణమని ప్రకాష్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌వల్ల అన్యాయం జరుగుతుందని చెప్పిన అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంటు సభ్యుడిగా అనర్హుడని ప్రకాష్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ రామచందర్‌రావుకు అస్వస్థత
బీజేపీ నేత, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు గురువారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు చేసుకోవడంతో బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేర్పించినట్టు ఆయన అనుచరులు తెలిపారు.