రాష్ట్రీయం

ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 21: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్నపొలమడ గ్రామ సమీపంలో ఉన్న ప్రబోధానంద ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, భారీ అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖరుల సమాశంలో ఆయన మాట్లాడుతూ ఆశ్రమంలో ఆధ్యాత్మిక బోధనలు చేస్తారని, ప్రజలకు మంచిమార్గం చూపుతారన్న నమ్మకంతోనే అందరిలాగే తానూ గతంలో ప్రారంభోత్సవానికి వెళ్లానని వివరించారు. అయితే, ఆశ్రమంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఆశ్రమంలో అధునాతన ప్రెస్ ఉందని, దొంగ నోట్లు ముద్రిస్తున్నారని ఆరోపించారు. నకిలీ ఆధార్‌కార్డులు, నకిలీ ఓటరు కార్డులు, రేషన్ కార్డులు తయారు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆశ్రమాన్ని మూసివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ‘హిందూ మత విశ్వాసాల్ని కించపరుస్తూ, హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తూ, దేవతల్ని నోటికొచ్చినట్లు దూషిస్తున్న ప్రబోధానంద ఓ రావణాసురుడంట, ఆయన మూడో భార్య మండోదరి అంట.. ఆయన బెడ్ పంచుకుంటే గోపికలంట.. ఇదేమి ఆధ్యాత్మికత’ అంటూ దివాకర్‌రెడ్డి విమర్శించారు. అక్కడ డేరాబాబా, మరోచోట రాసలీలలు నెరిపిన నిత్యానంద ఎలాగో, ఇక్కడ ఈ ప్రబోధానంద కూడా అలాంటి వాడేనని వ్యాఖ్యానించారు. అలాంటి వాడు మనమధ్య ఉండటం అవసరమా? అని ప్రశ్నించారు.
మూడుగ్రామాలకు వెళ్లే సత్యసాయి తాగునీటిని ఆశ్రమానికి దౌర్జన్యంగా, అక్రమంగా వాడుకోవడాన్ని ప్రశ్నించడమే వివాదానికి కారణమైందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఆశ్రమం నిర్వాహకులు అక్రమంగా తాగు నీటిని వాడుకుంటూ మూడు, నాలుగు గ్రామాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. ఆశ్రమంలో అక్రమంగా భవన నిర్మాణాలు చేపట్టారని, వాటికి ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. వీటిపై అభ్యంతరాలు చెప్పినందుకే ఆశ్రమ నిర్వాహకులు కోర్టుకు కూడా వెళ్లారని గుర్తుచేశారు.