రాష్ట్రీయం

నేత్రపర్వంగా గణనాథుని కల్యాణోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 21: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణం నేత్రపర్వంగా సాగింది. కాణిపాకం వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉభయదేవేరులతో కలసి స్వామివారు అశ్వవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేసారు. ఈ ఉత్సవానికి బొమ్మసముద్రం, తిరువనంపల్లి, చింతమాకులపల్లి, కారకాంపల్లి గ్రామాలకు చెందిన గోనుగుంట బలిజ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు అష్టోత్తర శత కలశ క్షీరాభిషేకం నిర్వహించారు. మూలవిరాట్‌కు ప్రత్యేక పంచామృతాభిషేకం చేసారు.
విఘ్నేశ్వరునికి శతకలశ క్షీరాభిషేకం
కాణిపాక ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి తిరుకళ్యాణం అశ్వవాహన సేవ జరిగింది. ఆలయ అలంకార మండపంలో రెండు ఉత్సవాలకు సంబంధించిన ఉభయదారులు వేర్వేరుగా ఉత్సవ మూర్తులను సాంప్రదాయపద్దంగా అష్టోత్తర శతకలశ క్షీరాభిషేకం నిర్వహించారు. ఈసందర్భంగా క్షీరకలశాలను ఉభయదారులు కాణిపాకం పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొని ఆలయానికి తీసుకొచ్చారు. అలంకార మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉభయదారుల సిద్ధి బుద్ధి సమేతంగా వినాయకుని ఉత్సవ మూర్తులను ఆలయ అర్చకులు క్షీరాభిషేకం, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఉత్సవ మూర్తులకు ఆల య అర్చకులు అలంకరణ చేసి దీపధూప నైవేద్యా లు సమర్పించారు. అనంతరం భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసీ వెంకటేష్, ఉపకార్యనిర్వహణాధికారులు కేశవరావు, రవీంద్రబాబు పాల్గొన్నారు.
ఆది దంపతులు భిక్షాటన..
వినాయకుని కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం కార్యక్రమం జరిగింది. శివుని కుమారుడైన వినాయకుడి కల్యాణం నిర్వహణకు ఆదిదంపతులు శివపార్వతులు కాణిపాకం పురవీధుల్లో భిక్షాటన చేశారు. కల్యాణానికి అవసరమైన వస్తుసామ గ్రి సమకూర్చుకోవడానికి శంకరుడు ద్రాక్షాయని గ్రామంలో భిక్షాటన చేశారు. మణికంఠేశ్వర ఆలయంలో శివపార్వతుల ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, పాలక మండలి చైర్మన్ సురేంద్రబాబు, అర్చకులు సోమశేఖర్ గురుకుల్ తదితరులున్నారు.

కమనీయం కల్యాణం..
ఉదయమే స్వామివారి మూలవిరాట్‌కు ఉభయదారులచే కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. రాత్రి స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవానికి కాణిపాకం, తిరువనంపల్లి గ్రామాలకు చెందిన వన్నిగకులస్థులు దేవస్థానం వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అనే్వటి మండపంలో ప్రత్యేక కల్యాణ వేదిక ఏర్పాటు చేశారు. ముందుగా సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామి వారి ఉత్సవ మూర్తులను సర్వలంకారశోభితులను చేశారు. నూతన వస్త్రాలతో అలంకరించిన ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వధూవరులను పుణ్యహవచనం కంకణ దారణ గావించారు. అశేషభక్త జనం చూస్తుండగా వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య వరసిద్దుడు ఉభయదేవేరులకు మాంగల్యదారణ చేసారు. కార్యక్రమంలో ఈవో పూర్ణచంద్రరావు, ఏసి వెంకటేష్, పాలక మండలి చైర్మన్ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.