తెలంగాణ

కేంద్ర నిధులపై సన్నగిల్లిన ఆశలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న కేంద్ర పథకాలకు ఈసారి కేంద్రం నుంచి పెద్దగా నిధులు వచ్చే అవకాశం లేదనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు భావిస్తున్నారు. పథకాలకు భారీ నిధులు వస్తాయనే ఆశలు వదులుకుని సొంత వనరులపైన ఆధారపడి బడ్జెట్‌కు రూపకల్పన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కొన్ని కేంద్ర పథకాలు, కేంద్ర రాష్ట్రాలు సమానంగా నిధులు భరిస్తూ అమలు చేస్తున్న పథకాలు ఉన్నాయి. వీటికి కేంద్రం నుంచి నిధులు ఈసారి వచ్చే అవకాశం లేదనే అంచనాతో తెలంగాణ ప్రభుత్వం సొంత వనరులే సమకూర్చుకుంటోంది. మహిళా సంక్షేమం, విద్యా రంగంతో పాటు పలు పథకాలకు గతంలో కేంద్రం భారీగా నిధులు కేటాయించింది. ఇప్పుడు వాటికి కోత విధించారు. రెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో మోడల్ స్కూల్ భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ భవనాలు నిర్మాణ దశలోనే ఉండగా కేంద్రం ఈ పథకానికి నిధులను కేటాయించడం నిలిపివేసింది. ప్లానింగ్ కమీషన్ స్థానంలో నీతి ఆయోగ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రం గతంలోని పథకాలకు తిలోదకాలు ఇచ్చింది.
ఒకవైపు రాష్ట్రంలో మోడల్ స్కూల్స్ నిర్మాణం సాగుతుండగా కేంద్రం ఈ పథకాన్ని నిలిపివేయడం రాష్ట్రానికి ఇబ్బంది కరమైన పరిస్థితే అని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇలాంటి పథకాలు ఇంకా చాలా ఉన్నాయని, వీటని కనీసం మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రం తరఫున ప్రతిపాదన అందజేసినట్టు ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. అదే విధంగా స్ర్తి శిశు సంక్షేమానికి సంబంధించిన పథకాలు, సర్వశిక్షా అభియాన్ పథకం వంటి వాటికి నిధులు తగ్గించారని అధికారులు తెలిపారు. ఫైనాన్స్ కమీషన్‌ను రద్దు చేసి ఆ స్థానంలో నీతి ఆయోగ్‌ను ఏర్పాటు చేసి నిధుల పంపకంలో చేసిన మార్పుల వల్ల తెలంగాణ, తమిళనాడు,బీహార్ వంటి రాష్ట్రాలకు నిధులు చాలా తగ్గాయనే విషయాన్ని ఆర్థిక శాఖ అధికారులు నీతి ఆయోగ్ సమావేశంలో వివరించారు. నిధుల అమలుకు ఇబ్బంది లేకుండా మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని సూచించారు. అయితే గతంలో కేంద్ర పథకాలకు ఆయా రాష్ట్రాలకు లభించే కేంద్ర సహాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర బడ్జెట్ రూపొందించే వారు. ఈసారి కేంద్రం పథకాలకు నిధుల కేటాయింపులో కోత విధించి, ఆదాయంలో వాటా పెంచుతున్నారు. దీని వల్ల రాష్ట్రం సొంతంగా పథకాలను రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో కేంద్ర పథకాల అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం మారిన పరిస్థితికి అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కన్నా ముందుగానే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 226 భవిత కేంద్రాలు

హైదరాబాద్, డిసెంబర్ 1: అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 3వతేదీన సర్వశిక్షా అభియాన్ ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ఎత్తున వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి. రాష్టవ్య్రాప్తంగా 226 భవిత కేంద్రాలను నెలకోల్పి నడుపుతోంది. ఏటా మానసిక, శారీరక లోపాలున్న పిల్లలను గుర్తించి వారికి తగిన రీతిలో చదవు చెప్పేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. అంతేగాక, ఇలాంటి పిల్లలు ప్రతిరోజు పాఠశాలలకు వచ్చేందుకు కొంత మేర రవాణా ఖర్చులను కూడా ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈనేపథ్యంలోనే సర్వశిక్షా అభియాన్ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి సమాజంలో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తోంది. 2వ తేదీ నుండి బిషప్ గ్రేసీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు మొదలవుతాయి.