రాష్ట్రీయం

తొందరపడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: మహాకూటమిలో చేరాలనే అంశంపై స్పష్టత ఉన్నా, మిగిలిన విషయాలపై తొందరపాటు వద్దని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబునాయుడు టీటీడీపీ నేతలకు హితవు పలికారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగినపుడు టీటీడీపీ నేతలు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఎన్నికలు, పొత్తులు, మహాకూటమి వ్యవహారంతో పాటు ధర్మాబాద్ కేసు అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలిసింది. చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, ఎంపీ నామా నాగేశ్వరరావు, రావుల చంద్రశేఖరరెడ్డి, ఇ పెద్దిరెడ్డి తదితర నేతలున్నారు. టీటీడీపీ- కాంగ్రెస్ మధ్య ఇప్పటికే జరిగిన ఐదు మార్లు చర్చల్లో వచ్చిన అంశాలు, సీట్లు, మేనిఫెస్టోల గురించి టీటీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాలకు పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. మిగిలిన 29 స్థానాలను టీడీపీకి, సిపీఐకి, తెలంగాణ జనసమితికి కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. సీపీఐ కనీసం 8 స్థానాలు ఇవ్వాలని గట్టిగా కోరుతోంది. తెలంగాణ జనసమితి కూడా 20 స్థానాలు కేటాయించాలని కోరుతోంది. కాంగ్రెస్ పార్టీ కేటాయించిన 29 స్థానాల్లో ఏడు ఎంఐఎం స్థానాలు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెడితే మిగిలినవి కేవలం 22 మాత్రమే. వీటిలోనే టీడీపీ, సీపీఐ, తెలంగాణ జనసమితి పార్టీలు సర్దుబాటు చేసుకోవల్సి ఉంటుంది. ఈ క్రమంలో సీపీఐకి మూడు, తెలంగాణ జనసమితికి నాలుగు, టీడీపీకి 15 వరకూ స్థానాలను కేటాయించే యోచనలో కాం గ్రెస్ ఉన్నట్టు తెలిసింది. ఎంఐఎం పోటీ చేసే చార్మినార్, యాకుత్‌పుర, చాంద్రాయణ గుట్ట, బహుదూర్‌పుర, మలక్‌పేట, నాంపల్లి, కార్వాన్ స్థానాలను కూడా పొత్తుల్లో భాగంగా మిగిలిన పార్టీలకు కేటాయించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది. అయితే టీడీపీ బీజేపీ పొత్తుతో గెలిచిన 15 నియోజకవర్గాలతో పాటు మరికొన్ని అదనంగా కే టాయించాలని కోరుతోంది. టీడీపీ కోరిన స్థానాల నే సీపీఐ సైతం కోరుతుండటంతో కొంత సందిగ్ధత నెలకొంది. రాష్ట్ర శాసనసభ రద్దు చేసే సమయానికి టీడీపీకి మిగిలింది మూడు స్థానాలే, అందులో రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో ఇద్దరు మాత్రమే టీడీపీకి మిగిలారు మిగిలిన 12మంది టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్‌తో గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆయా అసెంబ్లీల్లో నేడు టీ డీపీ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా పో యింది. వాటిలో కొన్నింటిని కాంగ్రెస్ పార్టీ తీసుకున్నా, టీడీపీకి ఇబ్బంది లేదని చెబుతున్నారు. సనత్‌నగర్ టీడీపీ అభ్యర్ధి తలసాని టీఆర్‌ఎస్‌లో చేరడంతో అక్కడ కాంగ్రెస్ అన్యర్ధిగా మర్రి శశిధర్‌రెడ్డికి టిక్కెట్ కేటాయించేందుకు ఎవరి నుండీ అ భ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. అలాగే మహేశ్వరం అసెంబ్లీ నుండి గెలిచిన తీగల కృష్ణారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో ఆ అసెంబ్లీని కాంగ్రెస్ అభ్యర్థిని సబిత ఇంద్రారెడ్డికి కేటాయించడంతో టీడీపీకి ఇబ్బంది రాదు. అయితే జగిత్యాల సీటును అటు జీవన్‌రెడ్డి కోరుతుండగా, టీడీ పీ కూడా తమకే ఆ స్థానాన్ని కేటాయించాలని కోరుతోంది. ఈ అంశాలపై మరింత విస్తృత చర్చ వచ్చే వారం జరగనుందని నేతలు చెబుతున్నారు.

చిత్రం..అమెరికా వెళ్లేందుకు శనివారం హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న
పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి, పుష్పగుచ్ఛాలనిస్తున్న టీటీడీపీ నేతలు