రాష్ట్రీయం

హైదరాబాద్ నుంచి 88 ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: వచ్చే నెలలో దశరా సెలవులతో పాటు వివిధ ప్రాంతాలకు వెళుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షణ మధ్య రైల్వే 88ప్రత్యేక రైళ్లను నడుపుతోందని సీపీఆర్‌ఓ ఉమాశంకర్ తెలిపారు. హైదరాబాద్ నుంచి విజయవాడ, నర్సాపూర్, కాకినాడ, తిరుపతి, కర్నాటకలోని రాయచూరు మార్గాల్లో ప్రత్యేక రైళ్ళు నడుస్తాయని చెప్పారు. ఈ రైళ్ళలో ఏసీ టూ టైర్, త్రీ టైర్ ఏసీ కోచ్‌లతో పాటు 12 బోగీల్లో స్లీపర్ కోచ్‌లు ఉంటాయన్నారు. హైదరాబాద్- విజయవాడ మధ్య నడిచే 07257 రైలు అక్టోబర్ 8,15,22, 29వ తేదీల్లో అలాగే నవంబర్ 5,12,19, 26వ తేదీలో హైదరాబాద్‌లో రాత్రి 10.20కి బయలు దేరి విజయవాడకు ఉదయం 6.35 గంటలకు చేరుకుంటుంది. ఈరైలు ఖాజీపేట, ఖమ్మం మీదుగా విజయవాడకు నడుస్తుంది. హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు 07258 రైలు అక్టోబర్ 7,14,21,,28 తేదీల్లో అలాగే నవంబర్‌లో 4,11,18, 25 వతేదీలో నర్సాపూర్‌లో సాయంత్రం 6 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 4 గంటలకు హైదరాబాద్ చేరుకుటుంది. కాకినాడ- తిరుపతి మార్గంలో 07210 రైలు సెప్టెంబర్ 30,అక్టోబర్ 5,7, 12,14,19, 21, 26వ తేదీల్లో, అలాగే నవంబర్‌లో2,4,,9,11,16,18,23,25,30వ తేదీలో కాకినాడలో సాయంత్రం 6 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 07209 రైలు తిరుపతి నుంచి కాకినాడకు అక్టోబర్ 1,6,8,13,15,20,22,27,29వ తేదీల్లో అలాగే నవంబర్ 3,5,10,12,17,19,24,26 వ తేదీల్లో తిరుపతిలో సాయంత్రం 7 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. కాకినాడ టౌన్ నుంచి కర్నాటక రాష్ట్రం రాయచూరుకు 36 ప్రత్యేక రైళ్ళు నడుస్తాయి, 07245-07246 నంబరుగల ఈ రైళ్లు అక్టోబర్ 2,4,9,16,18,23,25,30వ తేదీల్లో అలాగే నవంబర్ 1,6,8,13,15,20,22,27,29వ తేదీలో కాకినాడ టౌన్ నుంచి సాయంత్రం 3.05 గంటలకు మయలు దేరి మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు రాయచూరు చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రాయచూరు నుంచి అక్టోబర్ 3,5,10,12,17,19,24,26, 31వ తేదీలో రాయచూరులో మధ్యాహ్నం 2.25 గంటలకు మయలు దేరి మరుసటి రోజు ఉదయం 8,35 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుతుంది. ఈరైలు సామర్లకోట ద్వారపూడి రాజమండ్రి, భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, దొనకొండ, నంద్యాల, డోన్ గుంతకల్లు, ఆదోని, మంద్రాలయం మీదుగా రాయచూరు చేరుతుందని ఆయన తెలిపారు.