రాష్ట్రీయం

శోభాయాత్రపై నిఘా నేత్రం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా గణేషుని నిమజ్జన కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లూ చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా విస్తృతపైన చర్యలు తీసుకున్నారు. జంట నగరాల్లో, జిల్లాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గణేష్ శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఓ ప్రణాళికను రచించారు. అన్ని స్థాయిల పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. అనేక సూచనలు, సలహాలు ఇచ్చారు. శనివారం తన కార్యాలయం నుంచే కమాండ్ కంట్రోల్ వ్యవస్థ పనితీరుపై డీజీపీ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతి చిన్న సంఘటనలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తం చేయడం, దాన్ని వీక్షించడం జరుగుతుంది. ఈమేరకు సర్వసన్నద్ధంగా ఉండాలని మహేందర్‌రెడ్డి ఆదేశించారు. యాత్ర పకడ్బందీగా జరిగేందుకు ఓ సవాల్‌గా స్వీకరించాలని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల్లోని కేంద్రాల్లో జరుగుతున్న గణేష్ నిమజ్జనం కార్యక్రమాలను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తారు. పోలీసులు ఆధునిక టెక్నాలజీతో అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అన్నారు. చీమ చిటుక్కుమంటే తెలిసిపోవాలని ఆదేశించారు. ప్రజలతో పోలీసులు స్నేహక పూర్యకంగా పని చేయాల్సిందిగా ఆయన సూచించారు. శోభాయాత్ర వెంట భక్తులు ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు ప్రణాళికాబద్ధంగా ట్రాఫిక్ నిబంధనలు ఉండాలన్నారు. కాగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే వందంతులను నమ్మవద్దని డీజీపీ హెచ్చరించారు. శోభాయాత్రకు వచ్చే మహిళల భద్రతకు షీ టీమ్‌ను వినియోగించుకోవాలన్నారు. ఫీల్డ్ కంట్రోల్ రూమ్స్‌ను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇలా ఉండగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై జరిగే ఖైరతాబాద్ గణేషుని నిమజ్జనాన్ని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయడు వీక్షిస్తారు.

ఫోటో రైటప్:
=========
గణేశ్ నవరాత్రోత్సవాలు ముగియడంతో శోభాయాత్రకు ముస్తాబవుతున్న ఖైరతాబాద్‌లోని సప్తముఖ కాలసర్ప మహాగణపతిని దర్శించుకునేందుకు శనివారం సాయంత్రం పోటెత్తిన భక్తులు