రాష్ట్రీయం

శోభాయమానం.. వినాయక నిమజ్జనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఆదివారం శోభాయమానంగా ముగిసింది. 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఖైరతాబాద్ గణేశుడు మధ్యాహ్నం 12 గంటలకే గంగమ్మ ఒడికి చేరాడు. ఈ విగ్రహాన్ని తరలించేందుకు 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల భారీ క్రేన్‌ను ఉపయోగించారు. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన శోభాయాత్ర ఆరుగంటల పాటు సాగింది. లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్‌సాగర్ తీరానికి 11.30 గంటలకు చేరింది. 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ సాయంతో భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు.
*
హైదరాబాద్, సెప్టెంబర్ 23: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం శోభాయమానంగా పూర్తయింది. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప గణనాథుడిని మధ్యాహ్నం పనె్నండు గంటలకే నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు హుస్సేన్‌సాగర్‌లో 3500 విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. వినాయక చవితి తర్వాత హైదరాబాద్‌లోని వేర్వేరు జలాశయాల్లో దాదాపు 55 వేల గణేశుడి విగ్రహాలను నిమజ్జనం చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. సరూర్‌నగర్ చెరువుతో పాటు ఇతర ప్రాంతాల్లోని చెరువులను కూడా గణేశుడి నిమజ్జనం కోసం వినియోగించారు. 57 అడుగుల ఎత్తు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఖైరతాబాద్ గణేశుడి విగ్రహాన్ని త్వరగా నిమజ్జనం చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకే ముందుగానే నిర్వాహకులతో పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు చర్చలు జరిపారు. ఈ చర్చల ఫలితంగా ఆదివారం ఉదయం 6 గంటలకే ఈ భారీ గణేశుడి నిమజ్జనం కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. రాష్ట్ర పశుగణాభివృద్ధి మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో పాటు జీహచ్‌ఎంసీ, పోలీసు
అధికారులు పూజలు చేసి ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభించారు. ఈ విగ్రహాన్ని తరలించేందుకు 70 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు ఉన్న 26 టైర్ల భారీ క్రేన్‌ను ఉపయోగించారు. ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన శోభాయాత్రం ఆరుగంటల పాటు ముందుకుసాగింది. లక్డీకాపూల్, టెలిఫోన్ భవన్, రాష్ట్ర సచివాలయం, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా హుస్సేన్‌సాగర్ తీరానికి 11.30 గంటలకు చేరింది. 400 టన్నుల సామర్థ్యం కలిగిన క్రేన్ సాయంతో భారీ గణేశుడిని నిమజ్జనం చేశారు.
పాతనగరంలోని బాలాపూర్ నుండి సాగిన గణేశుడి ప్రధాన శోభాయాత్ర చాంద్రాయణగుట్ట, చార్మినార్, చాదర్‌ఘాట్, మోజంజాహీ మార్కెట్, అబిడ్స్ మీదుగా ఉస్సేన్‌సాగ్ వరకు కొనసాగింది. ఇంకా పాతనగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన ఊరేగింపులూ వినాయక సాగర్ వైపు కదిలాయి. ఇలాఉండగా మెహిదీపట్నం, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, అమీర్‌పేట, జూబ్లీహిల్స్ తదితర వైపుల నుండి భారీ గణేశుడి విగ్రహాలు తరలి వచ్చాయి. ఇవన్నీ వౌజంజాహీ మార్కెట్ వద్దకు చేరుకోవడంతో జనసంద్రంగా మారింది. కాషాయ దుస్తులు ధరించిన భక్తులతో, భాజభజంత్రీలతో, భక్తులు ఆనందోత్సాహాలతో నృత్యం చేశారు.
నగరంలో ఆదివారం ఎటు చూసినా గణేశ్ ప్రతిమల శోభాయాత్రలతో నిండిపోయింది. జై బోలో గణేశ్‌మహరాజ్‌కీ జై..గణపతి బొప్పా మోరియా, జైజై గణేశా అన్న నినాదాలతో నగరం మారుమోగిపోయింది.
నగరంలోని చిన్న చిన్న గణేశ్ ప్రతిమలను ఆ యా ప్రాంతాల్లోని చిన్న చెరువుల్లో నిమజ్జనం చేయగా భారీ గణేశులను మాత్రం ఉస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు.
ప్రత్యేక ఏర్పాట్లు
గణేశుడి భోభాయాత్ర, నిమజ్జనం సందర్భంగా ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరణ సంస్థ భారీగా ప్రత్యేక ఏర్పాట్లుచేసింది. 27 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతృత్వంలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆహ్వాన వేదికలను ఏర్పాటు చేశారు. అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం ఈ వేదికల వద్ద నెలకొంది. నిమజ్జంనలో పాల్గొన్న భక్తుల కోసం అనేక స్వచ్చంద సేవా సంస్థలు ఆహారాన్ని, పుళిహోర, మంచినీళ్ల సరఫరా చేశారు. లక్షలాది మంది ప్రజలు శోభాయాత్రను తిలకించారు. ఆర్టీసీ, రైల్వే శాఖలు భక్తుల రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి.