రాష్ట్రీయం

హేయం.. ఘోరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 23: అరకు ఎమ్మెల్యే కిడారు సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చిచంపటం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఈ సమాచారం తెలిసి దిగ్భ్రమకు లోనయ్యారు. జరిగిన ఘటనను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అరకు ఏజెన్సీలో మావోయిస్టుల హత్యాకాండను ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యున్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను ఆయన ప్రస్తుతించారు. హతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. విమానం నుంచే విశాఖ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడారు. దుర్ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోంమంత్రి, జిల్లా మంత్రులను సంఘటన స్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో హత్యలకు తావులేదన్నారు. ప్రజాప్రతినిధులను కాల్చిచంపటం ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ అని, మావోయిస్టుల దుశ్చర్య హేయమని అన్నారు. సివేరి, కిడారి కుటుంబాలకు అన్నివిధాలా అండగా ఉంటామని ప్రకటించారు. అభ్యుదయ, ప్రజాసంఘాలు వీరి హత్యలను ఖండించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.