రాష్ట్రీయం

వైద్యాంధ్రకు సహకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమెరిక పర్యటన చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి రోజైన ఆదివారం బిజీగా గడిపారు. తొలుత రేడియేషన్ ఆంకాలజిస్టు డాక్టర్ నోరి దత్తాత్రేయుడితో సమావేశమయ్యారు. తన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ద్వారా ఏపీలోని ఫిజిషియన్లకు అవసరమైన తర్ఫీదు ఇచ్చేందుకు నోరి ఈ సందర్భంగా అంగీకరించారు. ఏపీలో వైద్య సేవలకు అవసరమైన ఐఓటీ పరికరాలు అందించేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఆయనను కోరారు. వైజ్ఞానిక అంశాలే రాబోయే కాలాన్ని నడిపించే చోదక శక్తిగా ఉంటాయని
తెలిపారు. కేన్సర్ చికిత్సా విధానాల్లో నూతన ఆవిష్కరణలకు సహకరించాలని కోరారు. ఏపీకి వచ్చే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని హామీ ఇచ్చారు. విజ్ఞానం, సాంకేతికత ఊతంగా అమెరికాలో తెలుగువారి తలసరి ఆదాయం మరో ఐదేళ్లలో రెండింతలు కానుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు కేన్సర్ చికిత్సలో ఆధునిక వైద్య విధానాలు, శస్తచ్రికిత్స పద్ధతులను అందించేందుకు వైద్యులకు శిక్షణ ఇవ్వటానికి డాక్టర్ నోరి సంసిద్ధత తెలిపారు. శిక్షణ పొందిన వైద్యులు రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల వారికి అత్యాధునిక కేన్సర్ చికిత్స చేసే వీలు కలుగుతుందన్నారు. కాగా అంతకుముందు న్యూయార్క్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. అమెరికాలో అడుగుపెట్టిన వెంటనే విమానాశ్రయం నుంచే ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కిడారి హత్య, తదనంతర పరిణామాలపై చంద్రబాబు అత్యవసర సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతల పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

చిత్రం..అమెరికా పర్యటనలో డా. నోరితో భేటీ అయిన చంద్రబాబు