తెలంగాణ

హైదరాబాద్‌లో ఏరోనాటిక్స్ శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో ఏరోనాటిక్స్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఏరో క్యాంపస్ అక్విటైన్ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. శనివారం పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో పరిశ్రమలు, వాణిజ్య, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్, ఏరోక్యాంపస్ అకాడమి జిఎం జెరోమ్ వెర్చేవ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రి జూపల్లి మాట్లాడుతూ హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడంపట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ ప్రసిద్ధిచెందిన బోయింగ్, ఎయిర్‌బస్ వంటి సంస్థలు హైదరాబాద్‌కు రావడం ఆనందదాయకమన్నారు. అవగాహన ఒప్పందానికి సంబంధించి ఉన్న అంశాలను ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ వివరిస్తూ ప్రతిపాదిత ఏరోనాటిక్స్ శిక్షణ అకాడమీని బేగంపేట ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఏరోనాటికల్ నిపుణులు, స్ధానిక నిపుణుల సహకారంతో అకాడమిని ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రాధమికంగా 300మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేలా అకాడమిని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అనంతరం 1500 నుంచి 2 వేలమందికి శిక్షణ ఇచ్చేస్థాయికి తీసుకెళ్తామని వివరించారు. జెరోమ్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో శిక్షణ తీసుకున్న వారికి అధిక డిమాండ్ ఉంటుందని వివరించారు.

చిత్రం... మంత్రి జూపల్లి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న అధికారులు, సంస్థ ప్రతినిధులు