రాష్ట్రీయం

నా లెక్క నాకుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, సెప్టెంబర్ 23: ‘నా లెక్క నాకుంది, ఫ్లెక్సీల్లో కనిపించినంత మాత్రాన నేతలు కాదు, ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలో నాకు తెలుసు’.. అంటూ జనసేన వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆదివారం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు హాజరైన అనంతరం ఆయన పార్టీ ముఖ్యులతో ఆంతరంగిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ ఏదో చిన్న జెండా మోసేసి నేతలై పోదామనుకునే వారు అక్కర్లేదని, పార్టీ కోసం కష్టించి పనిచేసేవారే ముందుకు రావాలని కోరారు. కార్యకర్తలు జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. జనసేన ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ అని, అధికారం ముఖ్యం కాదన్నారు. కార్యకర్తలు కూడా తమ ఇగోలను పక్కనబెట్టి కలసిమెలసి పార్టీ అభివృద్ధికి కష్టపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సుమారు 21 లక్షల యువత ఓట్లను అక్రమంగా తొలగించారని,
వీరంతా జనసేనకు ఓటు వేస్తారనే భావంతోనే తొలగించారని ఆరోపించారు. అక్టోబర్ నెలాఖరు వరకూ అవకాశం ఉన్నందున యువత అందరూ ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని, ఇందుకోసం జనసేన కార్యకర్తలు యువతను ప్రోత్సహించాలని పవన్ పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు తనకు తెలుసునని, తమ ఎన్నికల మేనిఫెస్టోలో ఉపాధ్యాయుల జీతభత్యాల పెంపుదలను కూడా చేరుస్తామని పవన్‌కల్యాణ్ స్పష్టం చేశారు.

చిత్రం..నెల్లూరులోని బారాషాహిద్ దర్గా వద్ద ప్రార్ధనలు చేస్తున్న జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, ప్రముఖ నటుడు అలీ