రాష్ట్రీయం

హోదాపై మొసలి కన్నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 23: రాష్ట్రానికి హోదా తీసుకురావడంలో ఘోరంగా విఫలమైన తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు కేంద్రం అన్యాయం చేసిందంటూ మొసలి కన్నీరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూడటం విడ్డూరమని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు విమర్శించారు. ఆదివారం ఏపీసీసీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో అంటకాగి మోదీ మోజులో రాష్ట్రంలో జరిగిన హోదా ఉద్యమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో మళ్లీ యూటర్న్ తీసుకుని హోదాపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ తీర్మానం చేయడం శోచనీయమన్నారు. అంతేకాకుండా రాష్ట్ర విభజన పాపాన్ని కాంగ్రెస్‌పైకి నెట్టేసి, ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చాక సాధించిందేమిటో ప్రజలకు చెప్పాలన్నారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చే చర్యల్లో భాగంగా ఉద్యమకారులపై
పోలీసు కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిన విషయాలను ప్రజలు మరచిపోలేదన్నారు. చేసినవన్నీ చేసి ఇప్పుడు కేంద్రం నిర్లక్ష్యమంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే అయిపోతుందని, ప్రజలు నమ్ముతారనుకోవడం ఆయనకు కలగానే మిగులుతుందన్నారు. సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేవీపీ హెచ్చరించారు. హోదా ఉద్యమాన్ని నీరుగార్చిన పాపానికి ప్రాయశ్చిత్తంగా సీఎం చంద్రబాబు ఉద్యమకారులపై బనాయించిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాలుగుళ్లుగా టీడీపీ ప్రభుత్వం హోదా అంశంపై అనుసరించిన అప్రజాస్వామిక విధానాలపై మూడు పేజీల లేఖ రాసినట్టు తెలిపారు. హోదా ప్రకటన, విభజన హామీల అమలు కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తొలి సంతకం ఆంధ్రాకు ప్రత్యేక హోదా కల్పించే ఫైల్ పైనేనని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించిన విషయాన్ని కేవీపీ గుర్తుచేశారు.