రాష్ట్రీయం

అధికారం మనదే: ఉత్తమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ‘అత్యంత కీలకమైన రాబోయే రెండు నెలలు కష్టపడండి...అధికారం మనకే లభిస్తుంది’ అని టీ.పీసీసీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో అన్నారు. ఆదివారం ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నివాసం నుంచి ఫేస్ బుక్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారు. అనంతరం చార్మ్ ద్వారా 20 వేల మంది పార్టీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ ఇంత కాలం పార్టీకి కంటికి రెప్పలా కాపాడిన కార్యకర్తలు మరో రెండు, మూడు నెలలు కష్టపడితే అధికారంలోకి వస్తామన్నారు. పార్టీ అధికారంలోకి రాగానే కష్టపడిన కార్యకర్తలకు, నాయకులకు పార్టీలో, ప్రభుత్వంలో తగిన గుర్తింపునిస్తామని ఆయన తెలిపారు. ఇంత కాలం పని చేసిన కార్యకర్తల వల్లనే కాంగ్రెస్ ఒక బలమైన శక్తిగా ఎదిగిందని, అధికార పార్టీకి ధీటైన పోటీ ఇవ్వడానికి కార్యకర్తల చెమట చుక్కలే కారణమని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొందని, అక్టోబర్‌లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని, నవంబర్ చివర్లో ఎన్నికల పోలింగ్ ఉండే అవకాశం ఉందని, పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. ఈ నెల 25వ తేదీన ఓటర్ల జాబితా నమోదుకు, మార్పులకు పరిళీలనకు చివరి తేదీ కాబట్టి ప్రతి ఒక్కరు ఓటర్ల జాబితాను పరిశీంచి, పేర్లు లేని వారంతా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.
ఇంటింటికీ మంచి నీరు ఇస్తామని, ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆ హామీని నిలబెట్టుకోలేనందున, ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అన్నారు. పూర్తి కాలం అధికారంలో ఉండలేదు కాబట్టే ఇచ్చిన హామీని పూర్తి చేయలేక పోయామని చెప్పుకోవడానికి వేసిన ఎత్తుగడ ఇది అని ఆయన విమర్శించారు. గతంలో ఉచిత విద్యుత్తు ఇచ్చిన ఘనత తమదేనని ఆయన గుర్తు చేశారు.
ఇంకా ఏకకాలంలో రుణ మాఫీ చేశామని, ఆరోగ్య శ్రీ, ఫీజు రీ=యంబర్స్‌మెంట్, అమ్మ హస్తం, బంగారు తల్లి వంటి అనేకానేక పథకాలను తాము అధికారంలో ఉన్నప్పుడు చేపడితే, కేసీఆర్ వాటి పేర్లను మార్చి అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ ఎన్నికల్లో అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామన్నారు. ఇంకా 10 లక్షల మంది యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామని, అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోపే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పేదలకు ఉచితంగా సన్న బియ్యం ఇస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.