రాష్ట్రీయం

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, మార్చి 19: వివిధ రాష్ట్రాలకు యథేచ్ఛగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న అంతర్ రాష్ట్ర స్మగ్లర్లు అబ్దుల్ రెహమాన్ (52), సిజి లోకేష్ (42)లను శనివారం కడప జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.75లక్షలు విలువ చేసే 48 ఎర్రచందనం దుంగలతోపాటు రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు స్మగ్లర్లు కర్నాటక రాష్ట్రానికి చెందిన వారు. అబ్దుల్ రెహమాన్ కర్నాటక రాష్ట్రంలోని శిరా పట్టణానికి చెందిన వ్యక్తి. గతంలో కర్నాటకలోని చిత్రదుర్గకు చెందిన నాసిర్ అనే స్మగ్లర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తూ, స్మగ్లర్లతో పరిచయాలు ఏర్పాటు చేసుకుని సొంతంగా స్మగ్లింగ్ ప్రారంభించాడు. ప్రస్తుతం రెహమాన్ పృధ్వీ బీడీలు పేరిట కుటీర పరిశ్రమ నిర్వహిస్తున్నాడు. తయారైన బీడీలను బెంగళూరు పరిసర ప్రాంతాల్లో దుకాణాలకు సరఫరా చేస్తుంటాడు. గతంలో స్థానికంగా కౌన్సిలర్‌గా కూడా ఎన్నికయ్యాడు.
కర్నాటకలోని కటిగనహళ్లి, ఆంధ్రప్రదేశ్‌లోని కడప , చిత్తూరు జిల్లాల్లోని స్థానిక స్మగ్లర్ల నుంచి దుంగలు కొనుగోలు చేసి వాటిని కర్నాటక, తమిళనాడు, రాజస్తాన్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన స్మగ్లర్లకు విక్రయిస్తుంటాడని పోలీసు విచారణలో వెల్లడైంది. 2014లో బెంగుళూరులోని కేమ్‌గేరీ పోలీసులు రెహమాన్‌తోపాటు లోకేష్‌ను ఎర్రచందనం అక్రమరవాణా చేస్తుండగా పట్టుకోగా, ఆ కేసు విచారణలో ఉంది. రెహమాన్‌పై మొత్తం 19 కేసులు ఉండగా, 18 కేసులు కడప జిల్లాలోనే నమోదయ్యాయి. మరొక కేసు కర్నాటకలో నమోదైంది. మరో స్మగ్లర్ సిజి లోకేష్ కర్నాటక రాష్ట్రం మైసూర్ జిల్లా కొడగళ్లి గ్రామానికి చెందిన వ్యక్తి. ఇతను రెహమాన్‌కు ప్రధాన అనుచరుడు. రెహమాన్ చెప్పిన విధంగా పనులు చేస్తూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్నాడు. 2014లో బెంగుళూరు నగరంలోని కేమ్‌గేరీ పోలీసులకు రెహమాన్‌తో కలిసి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.