రాష్ట్రీయం

ఘనంగా అనంతపద్మనాభ వ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తిరుమలలో అనంతపద్మనాభ వ్రతం ఆదివారం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు శ్రీవారి సుదర్శన చక్రత్తాళ్వార్‌ను ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీ భూవరాహ స్వామి ఆలయం వద్దనున్న స్వామివారి పుష్కరిణి చెంతకు వేంచేపు చేశారు. అక్కడ చక్రత్తాళ్వార్‌కు అభిషేకాదులు నిర్వహించిన అనంతరం శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. ప్రతి సంవత్సరం భాద్రపదమాస శుక్ల చతుర్దశి పర్వదినాన అనంతపద్మనాభ స్వామి వ్రతం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మహిళల సౌభాగ్యం కోసం వరలక్ష్మీవ్రతం ఎలా చేస్తారో, పురుషులకు సిరిసంపదల కోసం అనంత పద్మనాభ వ్రతాన్ని నిర్వహిస్తారు. పాలసముద్రంలో శేషశయ్యపై పవళించి ఉండే దివ్యమంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. ఈ వ్రతంలో భూభారాన్ని మోస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకుని పవళించి ఉన్న శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..తిరుమలలోని స్వామివారి పుష్కరిణిలో చక్రత్తాళ్వార్‌కు చక్రస్నానం చేయిస్తున్న దృశ్యం