ఆంధ్రప్రదేశ్‌

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవ దానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 23: జీవన్మృతుడు (బ్రెయిన్ డెడ్) అయిన ఓ యువకుడి అవయవాలను బాధితుడి తల్లిదండ్రులు దానం చేసిన అరుదైన, హృదయ విదారకరమైన సంఘటన తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి స్థానిక అపోలో ఆసుపత్రిలో జీవన్మృతుడైన ఓ యువకుడికి వైద్యులు శస్తచ్రికిత్స నిర్వహించారు. గుండె, కాలేయం, నేత్రాలను వేర్వేరు ప్రాంతాల్లో అవసరమైన వారికి అమర్చడానికి యుద్ధప్రాతిపదికన పంపించారు.
ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం లక్కవరం గ్రామానికి చెందిన ముదునూరి సత్య సూర్యనారాయణరాము (24) అనే యువకుడు ఈనెల 18వ తేదీన అదే గ్రామంలో ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రమావశాత్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో రాము తలకు బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించిన పిమ్మట యువకుడి మెదడు (బ్రెయిన్ డెడ్) పనిచేయడం లేదని ధ్రువీకరించారు. దీంతో బాధిత యువకుడి తల్లిదండ్రులు బంధువైన ఓ వైద్యుడికి కుమారుడి విషమ పరిస్థితిని వివరించారు. బాధితుడి విషయంలో ఇక చేసేదేమీ లేదని, అతడి అవయవాలను దానం చేయాలనుకుంటే కాకినాడ నగరంలోని డీవీ రాజు మల్టీ ఆర్గాన్ సంస్థను సంప్రదించాలని సూచించారు. తమ కుమారుడి అవయవాలను దానం చేయాలనుకుంటున్నట్టు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వైద్యులతో మాట్లాడారు. వైద్యుల సూచన మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన జీవన్‌దాన్ విభాగాన్ని సంప్రదించారు. వారి సూచన మేరకు కాకినాడ నగరంలోని ఆసుపత్రిలో శనివారం బ్రెయిన్ డెడ్ అయిన రామును చేర్చారు. వెనువెంటనే అవయవదానానికి అవసరమైన చట్టపరమైన ఏర్పాట్లుచేశారు. రాము శరీరం నుండి శస్తచ్రికిత్స ద్వారా వేరు చేసిన గుండెను కోల్‌కతాకు, కాలేయాన్ని విశాఖ అపోలో ఆసుపత్రికి, రెండు నేత్రాలనూ కాకినాడ నగరంలోని ఐ బ్యాంక్‌కు తరలించారు.
ముఖ్యంగా శస్తచ్రికిత్స అనంతరం గుండెను నాలుగు గంటల్లోగా కోల్‌కతాలో ఉన్న వ్యక్తికి అమర్చాల్సి ఉండటంతో కాకినాడ నుండి మధురపూడి ఎయిర్‌పోర్ట్‌కు ప్రత్యేక అంబులెన్స్‌లో ఎస్కార్ట్‌తో పంపారు. ఈ వాహనం మధురపూడి ఎయిర్‌పోర్ట్ వరకూ వెళ్ళే మార్గంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తరలించారు. మధురపూడి నుండి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కోల్‌కతాకు తరలించారు. అలాగే కాలేయాన్ని కాకినాడ నుండి ప్రత్యేక అంబులెన్స్, ఎస్కార్ట్‌తో విశాఖలోని అపోలో ఆసుపత్రికి రోడ్డు మార్గంలో తరలించారు. కాలేయాన్ని శస్తచ్రికిత్స చేసిన 6 గంటల్లోగా వేరే వ్యక్తికి అమర్చాల్సి ఉందని వైద్యులు చెప్పారు. కాకినాడ నగరంలోని బాదం బాలకృష్ణ ఐ బ్యాంక్‌కు యువకుడి నేత్రాలను దానం చేశారు. ఈ ప్రక్రియనంతా కాకినాడ నగరంలోని అపోలో ఆసుపత్రిలో వైద్యారోగ్య, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో జరిపించారు.
చిత్రాలు.. గుండెను ఎయిర్‌పోర్టుకు తరలించడానికి ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన అంబులెన్స్
* (ఇన్‌సెట్‌లో) బ్రెయిన్ డెడ్‌అయిన సత్యసూర్యనారాయణ (ఫైల్‌ఫొటో)