రాష్ట్రీయం

ఎస్‌ఐ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 24: తను గ్రామ దర్శిని కార్యక్రమానికి వెళ్తున్నాను, బందోబస్త్ కావాలని అరుకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు కోరినా, స్పందించకపోవడంతో డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్‌రావును సస్పెండ్ చేసినట్టు పోలీసులు తెలియచేశారు. ప్రజా ప్రతినిధులకు సరైన రక్షణ కల్పించనందుకు ఆయనను సస్పెండ్ చేస్తున్నట్టు పోలీసు అధికారులు ప్రకటించారు. కాగా, ఎస్‌ఐ అమ్మన్‌రావును కేవలం సస్పెండ్ చేయడమే కాకుండా, అతనిని పూర్తిగా విధుల నుంచి తొలగించాలని పార్టీ కార్యకర్తలు సోమవారం హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు విజ్ఞప్తి చేశారు. పోలీసులు రక్షణ కల్పించి ఉంటే, ఇద్దరు ప్రజా ప్రతినిధులు ప్రాణాలు కోల్పోయేవారు కాదని వారు అన్నారు.