రాష్ట్రీయం

కుమారుడికి టికెట్ కోసం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి తన కుమారుడిని తెలంగాణ ఎన్నికల బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు జానారెడ్డి ఢిల్లీలో మకాం వేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర పార్టీ నాయకులను కలిసేందుకు తన కుమారుడు రఘువీర్‌తో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. అయితే రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్నందున ఆయన్ని కలిసే అవకాశం రాలేదు. అయితే తనతోపాటుగా తన కుమారుడు రఘువీర్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించాలని హైకమాండ్‌ను కోరనున్నట్టు సమాచారం. ప్రస్తుతం జానారెడ్డి నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే తన కుమారుడికి మిర్యాలగూడ స్థానం నుంచి పోటేచేసే అవకాశం కల్పించాలని రాహుల్‌కు విజ్ఞప్తి చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌లో ‘ఒక కుటుంబానికి ఒకే సీటు’ అన్న విధానం ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒకే కుటుంబం నుంచి పలువురు పోటీచేసి గెలిచిన సందర్భాలున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని జానారెడ్డి తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. అయితే 2014 మిర్యాలగూడ
అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందిన భాస్కర్‌రావు తరువాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీన్ని తనకు అనుకులంగా మలచుకొనేందుకు జానారెడ్డి తన ప్రయత్నాలకు మొదలుపెట్టారు. ఈసారి ఎలాగైనా తన కుమారుడు రఘువీర్‌కు టిక్కెట్టుకోసం హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు.

చిత్రం..జానారెడ్డి