రాష్ట్రీయం

మెట్రో ప్రయాణం.. సుఖం, సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 24: ట్రాఫిక్ సమస్య, కాలుష్యం బారిన పడకుండా ప్రయాణించేందుకు నగరవాసులంతా మెట్రోరైలును సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ నరసింహాన్ విజ్ఞప్తి చేశారు. మెట్రోరైలు కారిడార్-1లోని అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు మెట్రోరైలును గవర్నర్ నరసింహాన్, మంత్రులు కే. తారకరామారావు, నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బండారు దత్తాత్రేయలతో కలిసి అమీర్‌పేట స్టేషన్‌లో ప్రారంభించారు. ఎల్‌బీనగర్ వరకు ప్రయాణించిన గవర్నర్ మధ్య వచ్చే ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్‌ను కూడా పరిశీలించారు. గవర్నర్ మాట్లాడుతూ ఏ విషయంలోనైనా చెప్పే మాటలు తాను విననని, నేరుగా పరిశీలించిన తర్వాతే మాట్లాడుతానని స్పష్టం చేశారు. తరుచూ మెట్రోలో తాను ప్రయాణిస్తున్నానని, ప్రయాణం ఎంతో సుఖవంతంగా, సురక్షితంగా ఉందని వివరించారు. దేశంలో వివిధ నగరాల్లో మెట్రోరైలును అందుబాటులోకి తెచ్చినా, డిల్లీ తర్వాత అతిపెద్ద మెట్రోరైలు లేన్ ఇదేనని గవర్నర్ చెప్పారు. అత్యాధునిక ప్రమాణాలతో పబ్లిక్/ ప్రైవేటు భాగస్వామ్యం కింద నిర్మించిన మొట్టమొదటి ప్రాజెక్టు మెట్రోరైలు అని అన్నారు. ఐటీ మంత్రి కే. తారకరామారావు మాట్లాడుతూ గత సంవత్సరం నవంబర్ మాసంలో ప్రదాని నరేంద్రమోది చేతుల మీదుగా అమీర్‌పేట నుంచి మియాపూర్, అమీర్‌పేట నుంచి నాగోల్ వరకు సుమారు 30కిలోమీటర్ల మేరకు అందుబాటులోకి తెచ్చినట్టు వెల్లడించారు. ఇపుడు అమీర్‌పేట నుంచి ఎల్‌బీనగర్ వరకు 16కిలోమీటర్ల పొడువున అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. మెట్రోరైలు కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ వరకు రూట్ పూర్తయినట్లు వెల్లడించారు. మెట్రోరైలు మూడు కారిడార్లకు సంబంధించి 72 కిలోమీటర్ల ప్రతిపాదిత రూట్‌లో ఇప్పటి వరకు 46 కిలోమీటర్ల పొడువును మెట్రోరైలు అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. డిసెంబర్ నెలాఖరుకల్లా అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వరకు కూడా మెట్రోరైలును అందుబాటులోకి తెస్తామని వివరించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెట్రో స్టేషన్లను నిర్మించినట్లు తెలిపారు.

చిత్రాలు..అమీర్‌పేట-ఎల్బీనగర్ మెట్రోరైలును ప్రారంభించిన తర్వాత మెట్రో స్టేషన్ నుంచి రాజ్‌భవన్ వరకు స్మార్ట్‌బైక్‌పై సవారీ చేస్తున్న గవర్నర్ నరసింహన్, మంత్రి కేటీఆర్