రాష్ట్రీయం

బరితెగించిన ‘ఎర్ర’ స్మగ్లర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 24: ఎర్ర చందనం అక్రమ రవాణా చేసేందుకు కూలీలను తీసుకొస్తున్న లారీతో, టాస్క్ఫోర్స్, పోలీసులను ఢీకొట్టి హతమార్చేందుకు స్మగ్లర్లు యత్నించిన సంఘటన సోమవారం తెల్లవారు జామున తిరుపతి శివారున జరిగింది. ఇప్పటి వరకు ఎర్ర చందనం కూలీలు పోలీసులు, టాస్క్ఫోర్స్ సిబ్బంది నుండి తప్పించుకునేందుకు రాళ్లదాడులు, గొడ్డళ్లు విసరడం వంటివి మాత్రమే జరిగాయి. అయితే సోమవారం తెల్లవారుజామున ఏకంగా టాస్క్ఫోర్స్, పోలీసులను వాహనంతో గుద్దించి చంపేందుకు యత్నించడం సంచలనం రేపింది. టాస్క్ఫోర్స్ సీఐ మధుబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ సిబ్బంది బృందాలుగా విడిపోయి పుత్తూరు మార్గంలోని వడమాలపేట టోల్‌ఫ్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు. ఎర్ర చందనం స్మగ్లర్లు వాహనంలో వస్తున్నట్లు అధికారులకు ముందస్తు సమాచారం అందింది. ఈ మేరకు తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన ఒక లారీని సిబ్బంది ఆపగా, అది అతివేగంగా తమపైకి దూసుకు రావడంతో, సిబ్బంది చాకచక్యంగా తప్పించుకున్నారు. అనుకోని సంఘటన నుండి తేరుకున్న టాస్క్‌పోర్స్, పోలీసులు వెంటనే ఆ లారీని వెంబడించారు. లారీ తిరుపతి మార్గంలో రావడంతో గాజులమండ్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి కూడలిలో పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను ఢీకొని లారీ తిరుచానూరు రోడ్డులోనికి ప్రవేశించింది. దీనితో ఈ సమాచారాన్ని తిరుపతి కంట్రోల్ రూమ్‌కు చేరవేశారు. సమాచారం అందుకున్న తిరుచానూరు పోలీసులు బ్రిడ్జి దిగే ప్రాంతంలో బారీకేడ్లను పెట్టి వాహనాన్ని నిలిపారు.
అతివేగంగా వస్తున్న లారీ, పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లెక్కచేయకుండా వాటిని గుద్దుకుంటూ దూసుకుపోయింది. కొంతదూరంలో అంతకంటే ముందుగా రెండు లారీలు గుద్దుకుని ట్రాఫిక్ జామ్ కావడంతో లారీ డ్రైవర్ ఓటేరు వద్ద వాహనాన్ని రోడ్డుపైనే నిలిపేసి పరారయ్యాడు. కాగా, పారిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఏడుగురు స్మగ్లర్లు ఒకే వైపుకు వచ్చి దూకారు. మద్యం మత్తులో వీరంతా రోడ్డుపై ఒకరిపై ఒకరు పడడంతో గాయాల పాలయ్యారు. వెనుక వెంబడిస్తున్న టాస్క్ఫోర్స్, తిరుచానూరు పోలీసులు వీరిని పట్టుకున్నారు. లారీ వేగంతోపాటు, మద్యం మత్తులో కిందపడడంతో గాయలైన స్మగ్లర్లను చికిత్స నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.