రాష్ట్రీయం

తెలంగాణ మీ సొత్తుకాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగిన కొండా సురేఖ * టీఆర్‌ఎస్‌కు కొండా దంపతుల గుడ్‌బై
హైదరాబాద్, సెప్టెంబర్ 25: ‘తెలంగాణ కేసీఆర్ కుటుంబ సొత్తు కాదు. రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతోంది. కేటీఆర్‌కు పట్టం కట్టేందుకే ముందస్తు ఎన్నికలు. ఏ హోదాతో కవిత బోనం ఎత్తింది. మందు బిళ్లలు, మంచినీళ్లు ఇచ్చాడని ఎంపీ పదవి ఇస్తారా?. ఎవడబ్బా సొమ్మని హరికృష్ణ స్మారకానికి స్థలం కేటాయించారు?. కొండగట్టులో 60 మంది చనిపోతే వెళ్లేందుకు తీరికలేదు కానీ, హరికృష్ణ చనిపోతే పరామర్శించేందుకు తీరిక దొరికిందా? అని వరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండా సురేఖ నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్ పార్టీని తాము ఎందుకు వీడుతున్నామో 10 పేజీల బహిరంగ లేఖను మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేఖ విడుదల చేసారు. ఇందులో టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు కేటీఆర్, కవిత, సంతోష్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో నియంత పాలనను అంతమొందించడానికి విపక్షాలన్నీ ఏకమయ్యాయన్నారు. కూటమిని విమర్శిస్తున్న కేటీఆర్, మరి బీజేపీతో మీరెందుకు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారో చెప్పాలని సురేఖ నిలదీసారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలువకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న కేటీఆర్, అందుకు సిద్థంగా ఉండాలని సురేఖ సవాల్ విసిరారు. ఐదు సంవత్సరాలు పాలించేందుకు ప్రజలు అధికారమిస్తే, మధ్యలోనే వదిలేయడమంటే కట్టుకున్న భార్యను ఇతరులకు వదిలేసినట్టుగా ఉందని సురేఖ అభివర్ణించారు. టీఆర్‌ఎస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, సార్వత్రిక ఎన్నికలతో అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ముందస్తుకు వెళ్తున్నారని దుయ్యబట్టారు. ముందస్తు ఎన్నికల వ్యూహంతో కేసీఆర్ తన పతనాన్ని తానే గొయ్యి తవ్వుకున్నారన్నారు. ఒక్కరోజు కూడా సచివాలయానికి రాని ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. ఉద్యోగుల సమస్యలను తీర్చలేని అసమర్థ పాలన కేసీఆర్‌దన్నారు. ఒక్క మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వాన్ని నడిపిన చరిత్ర ఆయనదన్నారు. ఆయన మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అని సురేఖ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికో ఉద్యోగమని చెప్పి యువతను మోసం చేసి, తన ఇంట్లో మాత్రం నలుగురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారికి పదవులు ఇవ్వని కేసీఆర్, తనకు మందు బిళ్లలు, మంచినీళ్లు ఇచ్చాడని సంతోష్‌కు ఏకంగా రాజ్యసభ పదవి ఇచ్చారని సురేఖ గుర్తు చేసారు. బంగారు తెలంగాణ అంటే తన ఫామ్ హౌస్, ప్రగతి భవన్ బంగారం కావడం కాదన్నారు. ప్రణబ్ ముఖర్జీ రాష్టప్రతి హోదాలో హైదరాబాద్‌కు వస్తే కాళ్లు మొక్కిన కేసీఆర్, మరి రామ్‌నాథ్ కోవింద్ వస్తే కాళ్లు ఎందుకు మొక్కలేదన్నారు. రామ్‌నాథ్ కోవింద్ దళితుడు కావడం వల్లనే కాదా? అని సురేఖ ప్రశ్నించారు. ఎర్రబెల్లి అల్లుడు కాంగ్రెస్‌లో చేరితే తప్పు లేదుకానీ, డీఎస్ కుమారుడు బీజేపీలో చేరితే తప్పా? అని నిలదీసారు. లష్కర్ బోనాల్లో కేసీఆర్ కూతురు కవిత ఏ హోదాలో బంగారు బోనం ఎత్తుకుందని ప్రశ్నించారు. పైపుల కంపెనీల కమిషన్ల కోసమే మిషన్ భగీరథ పెట్టారన్నారు. కాంట్రాక్టర్ల వద్ద డబ్బులు దండుకుంటూ కేటీఆర్ కమీషన్ల రాజగా మారాడని ధ్వజమెత్తారు. తెలంగాణ జాతిపిత జయశంకర్‌కు స్మారక స్థూపం నిర్మించని కేసీఆర్, ఏవడబ్బ సొమ్మని హరికృష్ణ స్మారక స్థూపానికి స్థలం కేటాయించారని సురేఖ ప్రశ్నించారు. కొండగట్టులో 60 మంది చనిపోతే వెళ్లని కేసీఆర్‌కు, హరికృష్ణ చనిపోతే ఆయన ఇంటికెళ్లి పరామర్శించేందుకు తీరిందా? అని సురేఖ ప్రశ్నించారు. మాజీ మంత్రినై ఉండి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనను టీఆర్‌ఎస్‌లో ఎన్ని అవమానాలకు గురి చేసినా రాష్ట్రం కోసం కేసీఆర్ ఉద్యమం చేసాడన్న గౌరవంతో ఇంతకాలం బయటపడలేదన్నారు. నాలుగు ఐదు రోజుల్లో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.