రాష్ట్రీయం

జూబ్లీహిల్స్ ఓట్లు బంజారాహిల్స్‌కు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఓట్ల జాబితాల సవరణలో చిత్ర, విచిత్రాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు, పార్టీ ఎన్నికల సంఘం కన్వీనర్ జీ నిరంజన్ విమర్శించారు. నగరంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలోని సుమారు 700 కుటుంబాలకు చెందిన రెండు వేల ఓట్లను ఉన్నఫళంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి మార్చారని నిరంజన్ మంగళవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బాబూ జగ్జీవన్‌రాం నగర్‌కు చెందిన పోలింగ్ స్టేషన్లు 26, 27లలోని ఓట్లను జూబ్లీహిల్స్‌లోని 169వ పోలింగ్ స్టేషన్‌కు మార్చారని ఆయన తెలిపారు. అలా మారుస్తున్నట్లు ఆ నియోజకవర్గం ఓటర్లకు సమాచారం ఇవ్వలేదన్నారు. వారి ఓట్ల గుర్తింపు కార్డులపై నియోజకవర్గం జూబ్లీహిల్స్‌గా ఉంటే, ఖైరతాబాద్‌కు మార్చారని అన్నారు. దీంతో బ్లాక్, వార్డు అన్నీ మారిపోతాయని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని తాము కేంద్ర ఎన్నికల కమిషన్‌కు (సీఇసీ) లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. అంతేకాకుండా మంగళవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్‌నూ కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశామని ఆయన చెప్పారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టాల్సిందిగా సీఇవో రజత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారని నిరంజన్ తెలిపారు.