రాష్ట్రీయం

కేసీఆర్ ఎన్నికల టూర్ ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: వచ్చే నెల అక్టోబర్ 3 నుంచి ఉమ్మడి జిల్లాల వారిగా ఎన్నికల ప్రచార బహిరంగ సభలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 3న నిజామాబాద్, 4న నల్లగొండ, 5న వనపర్తి, 7న వరంగల్, 8న ఖమ్మంలో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారని టీఆర్‌ఎస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జిల్లాల్లో జరిగే బహిరంగ సభల్లో అన్ని నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు పాల్గొంటారని పేర్కొన్నారు.