రాష్ట్రీయం

అటవీ ప్రాంతంలో అడుగడుగునా తనిఖీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, సెప్టెంబర్ 25: అరకు ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మావోయిస్టులు హతమార్చిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న భద్రాచలం అటవీ ప్రాంతంలో పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో అదనపు బలగాలతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. మైదాన ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళే, వచ్చే వాహానాలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నాయనే సమాచారంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు కొద్ది రోజుల్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. గతంలో కూడా ఈ తరహలో సమావేశాలు ఏర్పాటు చేసి ఉమ్మడి నిర్ణయం తీసుకున్న తరువాత మావోయిస్టులకు గట్టి దెబ్బలు తగిలాయి. కొన్ని సందర్భాలలో పోలీసులు మావోయిస్టులపై పైచేయి సాధించారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలను దాదాపుగా నిరోధించారు. ఇప్పటికే గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ, సీఆర్‌పీఎఫ్ బలగాలతో అడవులను జల్లెడ పడుతున్న పోలీసులు.. నాలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల సమావేశం తరువాత వ్యూహాన్ని మార్చే అవకాశం ఉంది. సరిహద్దు ప్రాంతాలలో నిరంతర నిఘా ఉంచటంమే కాకుండా గ్రామాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని ప్రజలను ప్రశ్నిస్తూనే వారి కదలికల వివరాలను ఇన్‌ఫార్మర్లతో సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు హింసాత్మక చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే అనుమానంతో ఏజెన్సీ ప్రాంతంలోని రాజకీయ నాయకులను మైదాన ప్రాంతాలకు వెళ్ళాల్సిందిగా స్పష్టమైన అదేశాలను పోలీసులు జారీ చేశారు. ఈ ప్రాంతంలోని పార్టీల నేతలు ఎవరైనా తమకు సమాచారం ఇవ్వకుండా ఏజెన్సీ ప్రాంతాలకు రావద్దని కూడా అదేశించినట్లు సమాచారం. కాగా మావోయిస్టులు గతంలో మాదిరిగా భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలలో చర్యలకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారంతో నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే క్రమంలో అరకులో సంఘటన తరువాత మావోలు తెలంగాణ సరిహద్దులోకే వచ్చారనే సమాచారంతో సరిహద్దులోని సంతలను కూడా పోలీసులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని వ్యాపారులను కూడా ఇప్పటికే ప్రశ్నించినట్లు సమాచారం. పోలీసుల చర్యల వల్ల సామాన్య గిరిజనులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నా పోలీసులు మాత్రం వాటిని పట్టించుకోకుండా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు సైతం సమాచారం లేకుండా ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటించవద్దని, ఇప్పటికే అదేశాలు కూడా జారీ చేశారు.

సామాన్య భక్తులకు ప్రాధాన్యమివ్వండి
* ప్రముఖులు ఏడాదికోమారు దర్శనానికి వస్తే మంచిది
* ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు సూచన
తిరుపతి, సెప్టెంబర్ 25: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోవడానికి వచ్చే సామాన్య భక్తులందరూ స్వామిని దర్శించుకోవడానికి వీలుగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని టీటీడీ అధికారులకు సూచించానని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు అన్నారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే వెంకయ్యనాయుడు శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకు వచ్చారు. తిరిగి ఏడాది తరువాత స్వామివారిని దర్శించుకోవడానికి సోమవారం తిరుమలకు వచ్చారు. మంగళవారం ఉదయం విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఉపరాష్టప్రతి హోదాలో శ్రీవారి ఆలయ మహాద్వారం గుండా ఆలయంలోకి వెళ్లే సౌలభ్యం ఉన్నప్పటికీ ఆయన సామాన్యభక్తుడిలా కుటుంబ సభ్యులతో కలసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గుండా ఆలయం మహాద్వారం వద్దకు రాగానే టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజులు సాదర స్వాగతం పలుకగా, అర్చకులు ఇస్తికపాల్ స్వాగతం పలికారు. అనంతరం ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు శ్రీవారి సన్నిధికి కుటుంబ సభ్యులతో కలసి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు స్వామివారి వైభవాన్ని, ఆభరణాల విశేషాలను వివరించారు. ఆలయం తరపున స్వామివారి శేష వస్త్రాన్ని ఉపరాష్టప్రతికి బహూకరించారు. అనంతరం ఉపరాష్టప్రతి కుటుంబ సభ్యులతో కలిసి వకుళామాత ఆలయాన్ని, విమాన వెంకటేశ్వర స్వామిని, భాష్యకారుల సన్నిధిని, యోగ నరసింహస్వామిని దర్శించుకున్నారు. తర్వాత హుండీలో కానుకలు సమర్పించి, ధ్వజస్తంభం దర్శనం చేసుకుని రంగనాయక మండపం చేరుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. ఈఓ ఎకె సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు ఉపరాష్టప్రతి ఆయన కుటుంబ సభ్యులకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారి చిత్రపటాన్ని, నూతన సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన ఉపరాష్టప్రతి విలేఖరులతో మాట్లాడుతూ తిరుమల వేంకటేశ్వర స్వామి మీద రోజురోజుకీ ప్రజల్లో అపార భక్తి విశ్వాసాలు పెరుగుతున్నాయని, దీంతో ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని వారంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తిరుమలకు వస్తున్నారని చెప్పారు. తిరుమలకు వచ్చే ప్రతి సామాన్య భక్తుడు స్వామిని దర్శించుకునేలా ఎక్కువ సమయం కేటాయించాలని సూచించానన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు ఏడాదికి ఒకమారు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే సామాన్యభక్తులకు సులభంగా దర్శనభాగ్యం కలుగుతుందని అన్నారు. తాను ఎంపీగా ఉన్నా, ఉపరాష్టప్రతిగా ఉన్నా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారానే స్వామివారి దర్శించుకునేందుకు ఇష్టపడతానన్నారు. ఉప రాష్టప్రతిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భారత ప్రజలకు సేవలు అందించేందుకు తనకు మరింత శక్తిని, సామర్థ్యాన్ని, ఓపికను ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించానని చెప్పారు. దేశ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థించానన్నారు. ఉప రాష్టప్రతి వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ రెడ్డి, జిల్లాకలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ అభిషేక్ మహంతి, టీటీడీ ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ తదితరులు ఉన్నారు.