రాష్ట్రీయం

ఏమిటీ నిర్లక్ష్యం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వాకౌట్ చేసి ప్లకార్డులతో టీడీపీ ఎంపీల నిరసన
విజయవాడ, సెప్టెంబర్ 25: విజయవాడ, గుంతకల్లు, గుంటూరు రైల్వే డివిజన్లలోని సమస్యల పరిష్కారంకోసం దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ మంగళవారం సత్యనారాయణపురం రైల్వే శిక్షణ కేంద్రంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశం వాడివేడిగా జరిగింది. ఈ సమావేశానికి టీడీపీకి చెందిన 9మంది లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. సమావేశం ఆరంభంలోనే సభ్యులందరూ ముక్తకంఠంతో రైల్వే ఉన్నతాధికారుల నిర్లక్ష్యాన్ని నిరసించారు. గత నాలుగేళ్లుగా తమతమ ప్రతిపాదలన్నీ కాగితాలకే పరిమితమవుతుంటే ఏటా మొక్కుబడిగా జరుగుతున్న ఈ సమావేశాలు బిస్కట్, సమోసాలు, కాఫీలకే పరిమితమవుతున్నాయంటూ సమావేశం నుంచి వాకౌట్ చేసి వెలుపల రోడ్డుపై ప్లకార్డులు చేతబూని అరగంట సేపు నినాదాలు చేశారు. విశాఖ రైల్వేజోన్ సాధ్యం కాకపోతే ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినాసరే సరికొత్త రైల్వే జోన్ ఏర్పాటు చేయాల్సిందేనన్నారు. పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్ మాట్లాడుతూ విజయవాడ నుంచి ముంబై, బెంగుళూరుకు డైలీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని గత నాలుగేళ్లుగా తాను కోరుతున్నప్పటికీ ఎందుకు జాప్యం జరుగుతున్నదంటూ అధికారులను నిలదీశారు. కాకినాడ నుంచి షిర్డీకి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ను ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రోజూ నడపాలన్నారు. వించిపేట రైల్వే ఇన్‌స్టిట్యూట్ నుంచి పంజాసెంటర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించాలని, వాస్కో ఎక్స్‌ప్రెస్‌కు ఇంద్రకీలాద్రి ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని గట్టిగా కోరారు. ఈ సమావేశంలో టీడీపీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పీ రవీంద్రబాబు (అమలాపురం), ఎం శ్రీనివాసరావు (అనకాపల్లి), మాల్యాద్రి శ్రీరాం (బాపట్ల), మాగంటి వెంకటేశ్వరరావు (ఏలూరు), కేశినేని నాని (విజయవాడ), కొనకళ్ల నారాయణరావు (మచిలీపట్నం), నిమ్మల కిష్ణప్ప (హిందుపురం), ఎస్‌పీవై రెడ్డి (నంద్యాల), మాగంటి మురళీమోహన్ (రాజమండ్రి), బుట్టా రేణుక (కర్నూలు), రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మీ, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పాల్గొన్నారు.

జోన్ అంశం నా పరిధిలో లేదు: జీఎం యాదవ్
ద.మ రైల్వే పరిధిలోనున్న మూడు రైల్వే డివిజన్‌ల అభివృద్ధికి నిధులు పుష్కలంగా ఉన్నాయని తక్షణం వంద కోట్లు మంజూరు చేస్తున్నామని ద.మ రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రైల్వే జోన్ తన పరిధిలో లేదని రైల్వేబోర్డు, రైల్వే మంత్రిత్వశాఖలు నిర్ణయించాల్సి ఉందన్నారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను రూ. 400 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసేందుకు నేటి నుంచే టెండర్ల ప్రక్రియ ఆరంభమైందని అలాగే విజయవాడ, గుంతకల్లు, గుంటూరు, కర్నూలు రైల్వేస్టేషన్‌లలో ప్రయాణికులకు అవసరమైన వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. తిరుపతిలో అంతర్జాతీయ స్థాయిలో 8 అంతస్తుల్లో హోటల్ నిర్మాణం జరగబోతున్నదన్నారు. గుంటూరు - గుంతకల్లు మధ్య విద్యుద్ధీకరణ పనులు పూర్తవుతున్నాయని, డబ్లింగ్ పనులు పురోగతిలోనున్నాయని అన్నారు. విజయవాడ - విశాఖల మధ్య మూడో రైలు మార్గం నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని అన్నారు. నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గంలో ఇప్పటికే 42కి.మీ రైలుమార్గం నిర్మాణం పూర్తయిందని త్వరలో ప్రారంభమవుతుందన్నారు. ద.మ రైల్వే పరిధిలో గత ఆర్థిక సంవత్సరం విద్యుద్దీకరణ పనులు 608 కి.మీటర్లు పూర్తి కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 కి.మీ లక్ష్యంగా పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ సమావేశంలో మూడు రైల్వేజోన్‌ల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.