తెలంగాణ

సమీప బంధువు పనే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యార్థి అభయ్ హత్య కేసులో కొత్తకోణం వెలుగుచూసింది. విద్యార్థి తండ్రి రాజ్‌కుమార్ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు అభయ్ హత్యకు కారణాలుగా పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారి రాజ్‌కుమార్ సమీప బంధువు ఒకరు కక్షసాధింపుతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. కానీ సదరు బంధువును విచారిస్తే గానీ అసలు విషయం బయటకు రాదని, ఆ బంధువు ఎవరన్నది, అతని గురించి సమాచారం చెప్పేందుకు పోలీసులు నిరాకరిస్తున్నారు. రాజ్‌కుమార్‌తో హవాలా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తిగానే పేర్కొంటున్నారు. బేగంబజార్‌కు చెందిన వ్యాపారి రాజ్‌కుమార్ కుమారుణ్ని ఈనెల 16న కొందరు దుండగులు కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడు శేషు కాగా సాయిగా పేరు మార్చుకున్నాడు. శేషు రాజమండ్రి టాస్క్ఫోర్స్ పోలీసుల అధీనంలో ఉన్నాడు. అయితే విద్యార్థి అభయ్ హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు చేపట్టిన విచారణలో హత్యకు హవాలా లావాదేవీలు కూడా కారణమని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడు శేషు వెనక కొందరు హవాలా వ్యాపారులు ఉన్నారని, అభయ్ కిడ్నాప్‌కు రాజ్‌కుమార్ డ్రైవర్ లల్లన్ తివారి సహకరించాడని విచారణలో తేలడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అయితే ఈ హవాలా ముఠా రాజ్‌కుమార్ ఇంటి పక్కనే ఉన్న శేషును పావుగా వాడుకున్నట్టు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అభయ్ హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని కూడా పోలీసులు తేల్చారు. హత్యకు వాడిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. హంతక ముఠా ఆరు నెలలు రెక్కీ నిర్వహించింది. పోలీసుల దృష్టి మళ్లించేందుకు నిందితులు వాడిన సెల్ ఫోన్ ఒక చోట, వాహనం మరోచోట వదిలిపెట్టారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో నిందితులు వాడిన సెల్‌ఫోన్ ఆధారంగా విశాఖ, రాజమండ్రిలలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి పాత్ర కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక బృందాన్ని బీహార్‌కు పంపినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఇందులో భాగంగానే విద్యార్థి అభయ్ తండ్రి రాజ్‌కుమార్ కారు డ్రైవర్ లల్లన్ తివారిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు డిసిపి వెంకటేశ్వరరావు తెలిపారు. ఇదిలావుండగా రాజ్‌కుమార్ దంపతులు డబ్బు తీసుకొని సికింద్రాబాద్‌కు వస్తున్నామని ఫోన్ చేసి చెప్పినా, పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటారనే భయంతో కిడ్నాపర్లు అభయ్‌ను ఓ అట్టెపెట్టెలో పెట్టి సికింద్రాబాద్‌లో వదిలి పారిపోయి ఉంటారని, అభయ్ ఊపిరాడక మృతి చెందాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా దాదాపుగా అదే మాదిరిగా ఉన్నట్టు తెలిసింది.