రాష్ట్రీయం

‘అగ్రిగోల్డ్’పై ప్రత్యేక కోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని విధాలా న్యాయం చేసేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు డిప్యూటీ సిఎం, హోంమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప తెలిపారు. సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక కోర్టు ద్వారా బాధితులందరికి న్యాయం చేయాలని ఆలోచనతో సిఎం ఉన్నారని రాజప్ప తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో వామపక్షాలు ఆందోళన చేపట్టడం సరైంది కాదన్నారు. ఈ ఆందోళనల వల్ల బాధితులకు లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బాధితులపట్ల నిజంగా సానుభూతే ఉంటే సోమవారం వామపక్షాలు నిర్వహించ తలపెట్టిన ఆందోళన విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు కూడా ముఖ్యమంత్రి వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉన్నారన్న సంగతిని గ్రహించాలని రాజప్ప కోరారు.