రాష్ట్రీయం

ఉమ్మడి ఆస్తులపై ఆశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ పరిసరాల్లోని స్థిర చరాస్తుల్లో న్యాయపరమైన వాటా కోసం నవ్యాంధ్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఉన్నత విద్యామండలి విషయంలో సుప్రీం కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో, డిపాజిట్లు, ఆస్తుల్లో సమ వాటా రాబట్టేందుకు న్యాయ, ఆర్ధిక తదితర శాఖల ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేసి, నిపుణులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఏపీ పునర్వ్యవస్ధీకరణ చట్టం ప్రకారం 10వ షెడ్యూల్‌లో 107 సంస్థలు, 9వ షెడ్యూల్‌లో 67 సంస్థలు ఉన్నాయి. ఆర్ధిక శాఖ రూపొందించిన వివరాల ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, వివిధ సొసైటీలకు బ్యాంకుల్లో 16 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. సుప్రీం ఆదేశాల ప్రకారం వీటిల్లో దాదాపు రూ.9500 కోట్ల సొమ్ము ఏపీ ఖజానాకు రావాల్సి ఉంది. స్ధిర, చరాస్తుల విలువ దాదాపు రూ.70 వేల కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. కాగా కొన్ని సంస్థలు పీకల్లోతు అప్పుల్లో ఉన్నాయి. అటవంటప్పుడు అప్పులనూ రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అమల్లోకి వచ్చి 2014 జూన్ 2నాటికి బ్యాంకుల్లోని డిపాజిట్ల వివరాలను ఆర్ధిక శాఖ ఇప్పటికే సేకరించింది. 9, 10వ షెడ్యూల్‌లో ఉన్న సంస్థల స్థిర, చరాస్తుల్లోనూ తమకు వాటా కావాలని సుప్రీం కోర్టును కోరేముందు పరస్పరం ఒప్పందం ద్వారా సెటిల్ చేసుకుందామని ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణకు ప్రతిపాదనలు పంపనుంది. ఒకవేళ ప్రతిపాదనలకు తెలంగాణ అంగీకరించని పక్షంలో సుప్రీం ఆదేశించినట్టుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌ను సంప్రదించి, సంస్థ సిఫార్సులు, సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలనే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా సయోధ్య కుదరని పక్షంలో చివరి అస్త్రంగా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి రాజధానిలో ఆస్తుల వివరాల జాబితాను ఇప్పటికే సేకరించారు. పదవ షెడ్యూల్‌లో కొన్ని సంస్థలు పరస్పరం మాట్లాడుకుని విడిపోయాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు యాజమాన్యం అరమరికలు లేకుండా తెలంగాణ సహకార శాఖ అధికారులతో మాట్లాడుకుని మంచి ఒప్పందం చేసుకుని విడిపోయారు. అదే ఆర్టీసీలో బ్రేక్ పడింది. ముషీరాబాద్‌లోని బస్ భవన్‌తోపాటు ఇతర విలువైన భవనాలపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. డాక్టర్ ఎంసిహెచ్‌ఆర్‌డి, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, నేషనల్ అకాడమి ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌తో పాటు అనేక సంస్థలను తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 75 ప్రకారం భౌగోళికంగా ఏ ప్రాంతంలో ఉంటే అవి తామేననే సూత్రంతో తన ఆధీనంలోకి తెచ్చుకుందని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.