రాష్ట్రీయం

ఐటీ చరిత్రలో మైలురాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): ఆంధ్రప్రదేశ్ ఐటీ చరిత్రలో హెచ్‌సీఎల్ రాక ఒక మైలు రాయిగా మిగిలిపోతుందని రాష్ట్ర ఐటీ, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సోమవారం గన్నవరం మండలం కీసరపల్లి గ్రామంలో హెచ్‌సీఎల్ శాశ్వత భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు దశల్లో రూ.750 కోట్ల పెట్టుబడితో 7500 మందికి ఉపాది కలుగుతుందని, తొలి దశలో రూ.400 కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి హైఎండ్ ఐటీ ఉద్యోగాలు వస్తాయని అన్నారు. మొదటి దశలో ఐటీ రంగంలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ప్రారంభం అవుతాయన్నారు. కొత్త రాష్ట్రంలో హెచ్‌సీఎల్ రాక సంతోషంగా ఉందన్నారు. త్వరలోనే వెయ్యిమందితో స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉపాధి కల్పనలో స్థానిక యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. నాయకత్వం, ముందు చూపు కారణంగానే మార్పు సాధ్యవౌతుందన్నారు. 1965లో సింగపూర్ వెనుకబడిన చిన్న మత్యకార గ్రామమని ఒకే ఒక్క నాయకుడు లికువాన్ ముందు చూపు
నాయకత్వం కారణంగానే నేడు ప్రపంచంలోనే బలమైన శక్తిగా ఎదిగిందన్నారు. చైనాలో జియోపింగ్ తీసుకువచ్చిన సంస్కరణల కారణంగానే 2018నాటికి మన దేశం కంటే నాలుగు రెట్ల తలసరి ఆదాయం పెరిగిందన్నారు. మన దేశంలో హెచ్‌సిఎల్ అధినేత శివనాడార్ నాయకత్వం కూడా ఒక ఉదాహరణ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, నాడార్ వంటి నాయకులు కలిస్తే అబ్బుతం ఆవిష్కృతం అవుతుందన్నారు. సింగపూర్, చైనా దేశాల వలే సంక్షోభాలను ఇక్కడ అవకాశాలుగా మలుచుకుంటున్నామని తెలిపారు. హెచ్‌సిఎల్ క్యాంపస్ దేశంలోని ఇతర కేంద్రాల కంటే అతి పెద్ద కేంద్రం కాబొతుందన్నారు. ఏడాది లోపే మొదటి దశ భవనాలు పూర్తికానున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐటీ కంపెనీల రాక మొదలైందని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న యువత కూడా రాష్ట్రానికి తిరిగి వచ్చే విధంగా, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఐటీ రంగంలో 2019 నాటికి లక్ష ఉద్యోగాల కల్పినే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీఎల్ సీఈవో రోషీనీ నాడార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

చిత్రం..హెసీఎల్ భూమిపూజ శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రి లోకేష్, సంస్థ సీఈవో రోషినీ నాడార్ తదితరులు