రాష్ట్రీయం

అవినీతి పాలనకుచరమగీతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీ. వీ. ప్రసాద్
----------------

హైదరాబాద్, అక్టోబర్ 10: ఒకవైపు టీఆర్‌ఎస్, మరో వైపు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల మహాకూటమి ఎవరికి వారే తామే గద్దెనెక్కుతామని చెప్పుకుంటుండగా, ఒంటరిగా బరిలోకి దిగుతున్న బీజేపీ తెలంగాణలో అనూహ్యమైన ఫలితాలు రానున్నాయని భరోసాగా ఉంది. కుటుంబపాలనను, అవినీతి, అక్రమ పాలనను అర్ధం చేసుకున్న తెలంగాణ ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఇంటికి పంపించే రోజు దగ్గరపడిందని మార్పుకోసం బీజేపీకి ఓటు వేస్తారనే ధీమాలో బీజేపీ ఉంది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్‌తో ఆంధ్రభూమికి ఇచ్చిన ఇంటర్‌వ్యూలోని అంశాలు
బీజేపీ సన్నద్ధత ఎలా ఉంది?
జవాబు: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును ఎన్నికల కమిషన్ ప్రకటించడాన్ని బీజేపీ స్వాగతించింది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగతంగా అదే విధంగా ఎన్నికలకు పటిష్టమైన యంత్రాంగాన్ని తయారుచేసింది. గత వారం అసెంబ్లీల వారీ అభ్యర్ధుల ఎంపిక కసరత్తు పూర్తయింది. పార్టీ కేంద్ర పార్లమెంటరీ పార్టీ బోర్డుకు వాటిని పంపించడం జరిగింది. పార్లమెంటరీ బోర్డు సమావేశం అనంతరం అభ్యర్ధులను ప్రకటించడం జరుగుతుంది. నవంబర్ 12న నామినేషన్ల పర్వం ప్రారంభం అవుతుంది. కనుక అంతకంటే ముందే విడతల వారీ అభ్యర్ధులను ప్రకటించడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతిలో గెలుపు అభ్యర్ధులను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేయడం జరుగుతుంది.
బీజేపీ సన్నాహం ఏమిటి?
జవాబు: టీఆర్‌ఎస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపైనా, ప్రజా వ్యతిరేక విధానాలపైనా సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికపుడు ఉద్యమాలను పోరాటాలను చేపట్టింది. తెలంగాణ విమోచన
యాత్రతో పాటు రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లుపైనా, ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకంగా జన చైతన్య యాత్ర నిర్వహించి ప్రజలకు వివరించడమేగాక, వారిని చైతన్యవంతం చేసింది. కాంగ్రెస్ పార్టీ అవినీతిని, టీఆర్‌ఎస్ కుటుంబ పాలనను, అవినీతిని, ప్రజలకు తెలియజేసింది.
ప్రజాచైతన్యానికి తీసుకున్న చర్యలేమిటి?
మార్పు కోసం బీజేపీ పేరిట ప్రచారం చేస్తున్నాం, ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు తీసుకువెళ్తున్నాం, పల్లెపల్లెకూ బీజేపీ, ఇంటింటికీ మోదీ నినాదంతో రాష్టవ్య్రాప్తంగా ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 15న మహబూబ్‌నగర్ బహిరంగ సభ ద్వారా బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. బుధవారం నాటి మహబూబ్‌నగర్ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగంతో కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం పెల్లుబుకుతోంది.
తదుపరి ప్రచారం ఎలా ఉండబోతోంది?
ఈ నెల 27, 28 తేదీల్లో యువమోర్చ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జాతీయ యువ సమ్మేళనం జరగనుంది. 28న జరిగే బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ప్రచారం నిర్వహిస్తారు. యువమోర్చ సభకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు.
ఎన్నికలలో ప్రధాన అంశం ?
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు, నియంతృత్వ విధానాలు, అవినీతి కుంభకోణం, కుటుంబ పాలన, రాచరిక పాలన విధానాలను ఎండగడతాం. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత అవినీతి మచ్చ లేని బీజేపీ పాలన గురించి వివరిస్తాం.
మహాకూటమి ఏర్పాటుపై ...?
మార్పుకోసం ఈసారి బీజేపీ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం. టీఆర్‌ఎస్‌కు మహాకూటమి ప్రత్యామ్నాయం కాబోదు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, పీసీసీ అధినేత ఉత్తమకుమార్‌రెడ్డి ప్రజాసమస్యలను పక్కనపెట్టి ఒకరికొకరు అవకాశవాద విధానాలను అవలంభిస్తున్నారు. టీఆర్‌ఎస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు , కాంగ్రెస్ తన అవకాశవాద విధానాలను దృష్టి మళ్లించేందుకు ఈ రెండు పార్టీలూ పరస్పర వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నాయి. సభ్యసమాజం తలదించుకునేలా పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
కేంద్రం సహకరించడం లేదనే ఆరోపణలపై...
కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి వివిధ కార్యక్రమాలు కోసం 2.32 లక్షల కోట్లు ఇచ్చిందని కరీంనగర్ సభలో అమిత్ షా ప్రకటించారు. ముద్రా బ్యాంకు ద్వారా 15వేల కోట్లు , స్మార్టు సిటీకి 197 కోట్లు, అమృత్ పథకం కింద 832 కోట్లు, స్వచ్ఛ పధకం కింద 372 కోట్లు, అర్బన్ రవాణా కింద 800 కోట్లు, మెట్రో ప్రాజెక్టుకు 660 కోట్లు, 19 రైల్వే ప్రాజెక్టులకు 19900 కోట్లు, పట్టణ పునర్నిర్మాణ పథకం కింద 45 కోట్లు, ప్రధాని ఆవాస్ యోజన కింద 1200 కోట్లు, 9 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 900 కోట్లు, 30 రహదారి నిర్మాణ పనులకు 40,800 కోట్లు, బాలికా వికాస పథకం కింద వెయ్యి కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం పునరుజ్జీవనానికి 5వేల కోట్లు, మెదక్ ఎన్‌ఐఎంజడ్‌కు 17వేల కోట్లు, ఎయిమ్స్‌కు 1200 కోట్లు, సర్వ శిక్షా అభియాన్ కింద 1353 కోట్లు, ఇఎస్‌ఐ ఆస్పత్రికి 1200 కోట్లు, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జాల్లాల అభివృద్ధికి 400 కోట్లు ఇచ్చింది. అంటే 14వ ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు 1.15 లక్షల కోట్లుకు తోడు మరో లక్ష 20 వేల కోట్లు కలిపి కేంద్రం 2.32 లక్షల కోట్లు తెలంగాణ అభివృద్ధికి ఆర్ధిక సాయం అందజేసింది. గత ఆర్ధిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రానికి వచ్చింది కేవలం 16,597 కోట్లు మాత్రమే. ఇదంతా రాష్ట్రానికి అందించిన ఆర్ధిక సహకారం, కేంద్రం అనేక పథకాలను అమలుచేస్తూ సామాన్య ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు తీసుకువచ్చింది. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోంది. దానికో చక్కని ఉదాహరణ ఆయుష్మాన్ భారత్ , ఈ పథకం అమలుచేస్తే నరేంద్రమోదీపై గ్రామీణ ప్రజల్లో ఆదరణ ఎక్కడ పెరుగుతోందోనని ఆ పథకం అమలుకు రాష్ట్రం తిరస్కరించింది.
బీజేపీ సన్నద్ధత ఎలా ఉంది..?
గ్రామ గ్రామాన ఇంటింటికీ బీజేపీ పేరిట కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్రం తోడ్పాటు ఉంది. బీజేపీకి అవకాశం కల్పిస్తే దేశంలో ప్రవహిస్తున్న అభివృద్ధి గంగ తెలంగాణలోనూ ప్రవహిస్తుంది. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలో ఉంటే అనేక అభివృద్ధి పనులు ముందుకు తీసుకువెళ్లేందుకు సాధ్యమవుతుంది.
అధికార పార్టీ దూకుడు తట్టుకోగలరా?
కేసీఆర్ ప్రసంగంలో నైరాశ్యం, టీఆర్‌ఎస్ ఓటమి స్పష్టంగా కనిపిస్తోంది. కేసీఆర్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతోంది. దీంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం కనిపిస్తోంది. పరస్పర విరుద్ధమైనటువంటి టీడీపీ, కాంగ్రెస్, సీపీఐలు కూటమిగా ఏర్పడటం రాజకీయపరమైన , స్వార్థపూరితమైన ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడికి నరేంద్రమోదీ ఫోబియా పట్టుకుంది. నిద్రలో కూడా చంద్రబాబు నరేంద్రమోదీని కలవరిస్తున్నారు.
మహాకూటమిని ఎదుర్కోగలుగుతుందా?
మహాకూటమి టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కానేకాదు, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం, మహాకూటమి తెలంగాణలో ఎలా అభివృద్ధి చేయగలుగుతుంది? అసలు ప్రొఫెసర్ కోదండరాం కాంగ్రెస్ పార్టీతో , టీడీపీతో కలిసి ఎన్నికల్లో పొత్తును ఎలా సమర్ధించుకుంటారో ప్రజలకు చెప్పాలి. తెలంగాణ ఉద్యమంలో ప్రధానంగా టీడీపీని, కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా చూసిన కోదండరాం పొత్తును ఎలా సమర్ధించుకుంటారు? పులిచింతల, పొతిరెడ్డిపాడు గురించి కేసీఆర్ బహిరంగ సభల్లో మాట్లాడటం వల్ల తెలంగాణ ప్రజలు అమాయకులు కారు, తెలంగాణ ప్రజలు కేసీఆర్ మాటలు విని మోసపోవడానికి సిద్ధంగా లేరు. కడప జిల్లాకు నాయని నర్సింహారెడ్డి ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నపుడే ఆయన కళ్లముందే శంకుస్థాపన జరిగిన మాట వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావ, టీఆర్‌ఎస్ పార్టీ మునిగిపోతున్న నావ. ఎంఐఎంకు అమ్ముడుపోయి, రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను ఆశ చూపి ఎన్నికల రాజకీయాలు చేయాలని టీఆర్‌ఎస్ చూస్తోంది.
ఎన్నికల మేనిఫెస్టో సిద్ధమైందా..?
ఈసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆశయాలు, ఆలోచనలకు అనుగుణమైన మేనిఫెస్టోను రూపొందిస్తున్నాం. కొన్ని ఆలోచనలు ఇప్పటికే వచ్చాయి. ప్రజల అభిప్రాయాలను కూడా స్వీకరించి మేనిఫెస్టోను ఖరారు చేస్తాం. మోదీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, నీతివంతమైన పరిపాలన చూసి దేశవ్యాప్తంగా ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు. తెలంగాణలో కూడా బీజేపీని గెలిపిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉంది. ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ అస్తస్రన్యాసం చేశారు. అందరూ ఒప్పుకుంటే తాను ప్రధాని అవుతానని మాట్లాడటం వారి ఓటమిని వారే అంగీకరించినట్టు అయింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆనవాళ్లు లేకుండా పోయింది. దుర్బిణీ పట్టి చూసినా ఎక్కడా కాంగ్రెస్ ఆచూకీ లేదు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, కుంభకోణాల దోపిడీని తెలంగాణ ప్రజలు మరిచిపోరు.

-- బీ. వీ. ప్రసాద్