రాష్ట్రీయం

తిరుపతి ఐఐఎస్‌ఈఆర్‌కి శాశ్వత భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఖర్చుకానున్న రూ.1137.16 కోట్లు * పర్యావరణ పరిరక్షణకు ఫిన్లాండ్‌తో ఒప్పందం
* కొత్తగా నేషనల్ కౌన్సిల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ * కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 10: తిరుపతిలో భారత సైన్స్, విద్య, పరిశోధన (ఐఐఎస్‌ఈఆర్)ను శాశ్వత క్యాంపస్‌లో ఏర్పాటు చేసి ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. తిరుపతితోపాటు ఒడిశ్శాలోని బెరహంపూర్‌లో ఏర్పాటు చేస్తున్న ఐఐఎస్‌ఈఆర్‌ను కూడా శాశ్వత క్యాంపస్‌లో ఏర్పాటు చేసి ప్రారంభించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలకనిర్ణయాలు తీసుకుంది. తిరుపతిలో శాశ్వత క్యాంపెస్‌కు పెట్టుబడి కింద రూ.1137.16 కోట్లు, ప్రతి సంవత్సరం వచ్చే ఖర్చు కింద రూ.354.18 ఖర్చుచేస్తారు. అలాగే బెరహంపూర్ క్యాంపెస్‌కు రూ.1229.32కోట్లు, రికరింగ్ ఖర్చు కింద 353.46 కోట్లు ఖర్చవుతాయి. ఈ రెండు విద్యా సంస్థలను ఒక్కొక్క దానిని 1,17,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తారు. మొత్తం 1855 మంది విద్యార్థులకు అవసరమైన అన్ని వౌలిక సదుపాయాలను ఈ క్యాంపస్‌లలో ఏర్పాటు చేస్తారు. శాశ్వత భవనాల నిర్మాణం పనిని 2021 డిసెంబర్‌లోగా పూర్తి చేస్తారు. ఐఐఎస్‌ఈఆర్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి, పీహెచ్‌డీ.. అనుసంధాన పీహెచ్‌డీల్లో నాణ్యమైన విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. సైన్స్‌కు సంబంధించిన పలు రంగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి. ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు 2015లో తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ను తాత్కాలిక ఏర్పాట్లతో ప్రారంభించటం తెలిసిందే.
భారత్, ఫిన్లాండ్ మధ్య పర్యావరణ పరిరక్షణ రంగంలో పరస్పరం సహకరించుకునే ద్వైపాక్షిక ఒప్పందానికి కేంద్రమంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. వాతావరణ, జలకాలుష్యాన్ని నిరోధించేందుకు ఇరు దేశాల మధ్య సాంకేతిక పరిజ్ఞానం మార్పిడి చేసుకోవాలని ఒప్పందంలో నిర్ణయించారు. ఇరుదేశాలు పర్యావరణ పరిరక్షణకు అంతర్జాతీయంగా అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి మార్చుకోవాలని ఒప్పందంలో పేర్కొన్నారు. వాతావరణ మార్పుల నియంత్రణ, వన్యప్రాణి సంరక్షణ, అడవుల పెంపకంపై కూడా ఇరు దేశాలు సహకరించుకుంటాయి. ఇంకా ఆర్థ్ధిక రంగం, ప్రకృతివనరులు, సముద్ర సంపద పరిరక్షణ, కోస్తా తీరం పరిరక్షణ రంగాల్లో కూడా ఇరుదేశాలు సమన్వయంతో, సమష్టి భాగస్వామ్యంతో పనిచేయాలని తీర్మానించాయి. రుమేనియాతో పర్యాటక సంబంధాల పటిష్టం చేసే ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
నేషనల్ కౌన్సిలర్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ ఏజన్సీలను విలీనం చేసే ప్రతిపాదనకు కేంద్రమంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ రెండు సంస్థలను కలిపి కొత్తగా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్‌ను ఏర్పాటు చేస్తారు. దేశ వ్యాప్తంగా వృత్తి విద్య, శిక్షణ రంగాలను పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నాణ్యమైన నైపుణ్య విద్యలో సంస్కరణలు తేవాలని తీర్మానించారు. ఈ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తారు. మానవ వనరుల విభాగాన్ని అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పారిశ్రామిక రంగంలో నాణ్యమైన సేవలు అందించేందుకు వీలుగా టెక్నాలజీని అభివృద్ధి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.