రాష్ట్రీయం

ప్రజలను అప్రమత్తం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. బుధవారం రాత్రి ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ, పోలీస్, విపత్తు నిర్వహణశాఖ అధికారులతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని సహాయచర్యల్లో ఏ మాత్రం అలసత్వం వహించరాదన్నారు. అర్ధరాత్రి 2 గంటల నుంచి ఉదయం 5.30 గంటల లోపు తీరాన్ని తాకే సమయంలోనే అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. శ్రీకాకుళం పట్టణం వద్ద తుపాను తీరాన్ని తాకే అవకాశం ఉందని, తరువాత విజయనగరం వైపుకదలనుందని అధికారులు అంచనా వేశారు. శ్రీకాకుళం జిల్లాలో రాత్రి 11 గంటల నుంచి కుంభవృష్టి కురిసే అవకాశాలు ఉన్నాయని గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. ఇప్పటికే సోంపేట, కోట బొమ్మాళి, శ్రీకాకుళంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆస్తి నష్టం నియంత్రించాలని ముఖ్యమంత్రి సూచించారు. జననష్టం కలుగకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శిబిరాలలో అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, భోజనం, తాగునీరు పంపిణీ చేయాలన్నారు. హుదుద్ తుపానును ఎదుర్కొన్న స్ఫూర్తితోనే తిత్లీ తుపానును అధిగమించాలన్నారు. ఇదొక పరీక్ష అని, దీనిని ఎలా ఎదొర్కొన్నామో తరువాత ఫలితాలు వెల్లడించాలని నిర్దేశించారు. మత్స్యకారులు చేపలవేటకు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. బస్సుల రాకపోకలు, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని సూచించారు. కాలువలకు నీటి విడుదలను నిలిపివేసి, గండ్లు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విపత్తు నిర్వహణ, రెవిన్యూ, పోలీస్, అగ్నిమాపకశాఖలు అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యుత్, పంచాయతీరాజ్, రవాణాశాఖ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. జిల్లా, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలన్నారు. రియల్‌టైమ్ గవర్నెన్స్‌తో సమన్వయం చేసుకోవాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా బ్లీచింగ్, క్లోరిన్ టాబ్లెట్లు సిద్ధం చేయాలన్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలో దించాలని సూచించారు. తాగునీటి కొరత లేకుండా జనరేటర్లు సిద్ధం చేసుకోవాలని ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒక మొబైల్ వాహనాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో 43 పోలీస్ స్టేషన్ల సిబ్బంది సహాయ చర్యలకు సన్నద్ధం కావాలన్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిన వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలని అధికార యంత్రాంగాన్ని కోరారు.

తీవ్ర ప్రభావానికి గురయ్యే ప్రాంతాలు
తుపాను ప్రభావం వలన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, కవిటి, మందస, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, లావేరు, రణస్థలం, పాతపట్నం, నర్సన్నపేట, పొలాకి, గార, ఎచ్చెర్ల, ఆముదాలవలస, పొందూరు, సంతకవిటి, జి.సిగడాం గ్రామాల్లోను అలాగే విజయనగరం జిల్లా చీపురుపల్లి, పూసపాటిరేగ, గరివిడి, నెల్లిమర్ల, గుర్ల, విజయనగరం, కొత్తవలస, డెంకాడ, భోగాపురం, గంట్యాడ, బొండపల్లి, గజపతినగరం, మెరముడిదాం, దత్తిరాజేరు ప్రాంతాల్లోను, విశాఖ జిల్లా భీమునిపట్నం, ఆనందపురం, పద్మనాభం, విశాఖపట్నం అర్బన్, రూరల్ ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. దీని ప్రభావం వలన చెట్లు నేలకూలే ప్రమాదం ఉంది. అలాగే విద్యుత్ స్తంభాలు దెబ్బతినే అవకాశం ఉంది. విద్యుత్, కమ్యూనికేషన్స్ వ్యవస్థలకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది.