రాష్ట్రీయం

పొత్తులను మీరా విమర్శించేది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* టీఆర్‌ఎస్ అధినాయకత్వంపై ఉత్తమ్ మండిపాటు * వీహెచ్ రథయాత్ర ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్ 11: తెలంగాణ ద్రోహులకు మంత్రి పదవులు కట్టబెట్టిన టీఆర్‌ఎస్‌కు తమ పొత్తుల గురించి విమర్శించే అర్హత ఎక్కడదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకున్నప్పుడు అప్పుడా పార్టీ తెలంగాణ వ్యతిరేకి అన్న విషయం గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుఎన్నికల ప్రచార బస్సుయాత్రను గురువారం గన్‌పార్క్ వద్ద ఉత్తమ్ ప్రారంభించారు. మహాకూటమిలో టీడీపీతోకాంగ్రెస్ జత కట్టడం పట్ల విమర్శలు గుప్పిస్తోన్న టీఆర్‌ఎస్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావుకు మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు వారు ద్రోహులన్న విషయం గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన సీపీఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడు సిద్ధాంతాలు ఏమయ్యాయని అడిగారు. రాయల తెలంగాణ రాష్ట్రానికి డిమాండ్ చేసిన ఎంఐఎం టీఆర్‌ఎస్‌కు మిత్రపక్షం ఎలా అయిందని ఉత్తమ్ నిలదీశారు. అసలు తెలంగాణకు మొట్ట మొదటి ద్రోహి కేసీఆరేనని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ను శాశ్వతంగా బొందపెట్టాలని పీసీసీ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. వీహెచ్ మాట్లాడుతూ, కేసీఆర్ ప్రజలకు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు సోనియాగాంధీ కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన పోసుకుంటానని చెప్పిన చంద్రశేఖరరావుఆ తర్వాత ఆమెను కించపరిచేలా మాట్లాడి అవమానపర్చారన్నారు. కేసీఆర్ మోసాలు, వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే తాను బస్సుయాత్ర చేపట్టానని వీహెచ్ తెలిపారు. కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే ఈ యాత్రను మొదలు పెడుతున్నానని ఆయన ప్రకటించారు.
ఇలా ఉండగా గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు ఆర్పించాక ప్రారంభమైన హనుమంతరావు బస్సుయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా బస్సుయాత్రను అనుమతి లేదన్నారు. నాంపల్లి ఏరియా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు చేయడం వల్లనే యాత్రను అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. బస్సు యాత్రకు అనుమతి ఉందని వీహెచ్ చెప్పినప్పటికీ సరైన పత్రాలు చూపించకపోవడంతో ఆపాల్సి వచ్చిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎవరు యాత్ర చేపట్టినా ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని రిటర్నింగ్ అధికారి ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.