రాష్ట్రీయం

మీరే తీర్పు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* కాంగ్రెస్‌కు క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్ లేడు * సిరిసిల్ల సభలో మంత్రి కేటీఆర్
సిరిసిల్ల, అక్టోబర్ 11: ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన కోర్టు లేదని, ఆ ప్రజాకోర్టులో తీర్పు మీరే చెప్పాలని మంత్రి కె.తారకరామారావు పిలుపునిచ్చారు. తాము తప్పు చేస్తే, అబద్ధాలు చెబితే తమను ఓడించాలని, తమది వాస్తవమని నమ్మితే అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే కాంగ్రెస్‌కు డిపాజిట్లు గల్లంతు చేసి, ఊరి పొలిమేరల వరకు తరిమి కొట్టాలని ఆయన కోరారు. గురువారం సిరిసిల్ల జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక శాంతినగర్‌లో జరిగిన టీఆర్‌ఎస్ బహిరంగ సభలో మంత్రి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెరాసలో చేరిన పలువురు యువకులకు ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి తారకరామారావు మాట్లాడుతూ కేసీఆర్‌ను ఓడించాలనే ఏకైక లక్ష్యంతో అబద్దాలు చెబుతూ, ప్రజలను మభ్య పెడుతున్న కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బలా ఓటుతో దెబ్బకొట్టండన్నారు. అభివృద్ది వారు చేయరు, తమను చేయనివ్వరని, వీరికి అడ్డుకట్ట వేయాలంటే ఓటుతోనే సరైన న్యాయం చేయాలన్నారు. మానేరులోని నీటిని ప్రతి పొలానికి, ప్రతి ఇంటికి సాగు, తాగు నీటిని ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే వీరికి ఇక ప్రజలు ఓట్లు వేయరనే భావనతో సచ్చిపోయిన వారి పేర్లు రాసి, దొంగ వేలి ముద్రలు వేసి కోర్టులో 200 తప్పుడు కేసులు వేసి నీచానికి దిగజారారని అన్నారు. ఆచరణలో అమలు కాకున్నా కేసీఆర్ ఏది అంటే దానికి రెండింతలు ప్రకటిస్తుంటే ఉత్తుత్తి మాటల ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నోటికి వచ్చిన హమీలు ఇస్తున్నారని, రేపు ఆయన ఉంటాడని గ్యారంటీ లేదని, కాంగ్రెస్‌లో 30 మంది సీఎం రేసులో ఉన్నారని, ఆ పదవి అర్రాస్‌లో పాటలా ఉంటుందన్నారు. 67 ఏళ్ళ కాంగ్రెస్ స్వాతంత్య్రం వచ్చిన 67 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ కేవలం రూ.200 దాటి ఇవ్వలేదని, ఇపుడు రెండు వేలు ఇస్తామని అంటున్నారని, కానీ ఆ రెండు వేల మాట రావడంలో గులాబీ పార్టీయే ప్రభావమేనని చెప్పక తప్పదన్నారు. ఇక్కడ రెండు వేల పెన్షన్ ఇస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ వారు అధికారంలో ఉన్న పంజాబ్, కర్ణాటకలో ఎందుకు అమలు చేయడం లేదని, ఇక్కడ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని, అయినా ప్రజలు వారి మాటను నమ్మే పరిస్థితి లేదని, కేసీఆర్‌పై విశ్వాసంతో ఉన్నారని, కాంగ్రెస్ దేనికైనా దిగజారి అమలు కాని కొత్త వాగ్దానాలు చేస్తున్నదని, రేపు ప్రజల చంటి పిల్లలకు డైపర్లు సైతం తామే వచ్చి తొడుగుతామనే పరిస్థితిలో హామీల వర్షం కురిపిస్తున్నారని అన్నారు. రెండు లక్షల రుణాలు రైతులకు ఉండే పరిస్థితి లేదని, రెండు లక్షల రుణ మాఫీ కూడా ఉత్తదేనన్నారు. కాంగ్రెస్‌లో క్యాడర్ లేదు, టీడీపీకి లీడర్లు లేరని, జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు డబ్బాలు తెరిచిన నాడు వీరి భాగవతం బయట పడుతుందన్నారు. ఇసుక స్మగ్లింగ్ అంటూ ప్రభుత్వాన్ని బదునాం చేస్తున్నారని, ఇసుక జాతి సంపద అని, ప్రజలకు ఆదాయం పెంచేదని, పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో కేవలం ఏటా రూ.39.40 కోట్ల ఆదాయం మాత్రమే తెస్తే, తాము రూ.200 కోట్ల ఆదాయం తెచ్చామని అంటే మిగిలిన రూ.96 కోట్లు ఏటా ఎటు పోయాయని, 500 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడిస్తామంటూ అన్ని పార్టీలు ఒక్కటయ్యాయని, అగర్భ శత్రువులు, పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే వారు ఏకమయ్యారని, అయితే ఎందుకు కేసీఆర్‌ను ఓడించాలో చెప్పాలని, తమ పథకాలతో ప్రజలనపు ఆదుకున్నందుకే, జరిగిన అభివృద్దికా చెప్పాలని కేటీఆర్ అన్నారు. ఇక బీజేపీ అడ్డగోలు జమాబంది వాగ్దానాలు చేస్తున్నదని, ప్రజల ఇంటి అద్దెలు సైతం బీజేపీ కడుతామని చెబుతున్నదని, కానీ ఓట్ల రద్దుతో మహిళలకు పోపుల డబ్బాల్లో దాచుకున్న డబ్బులను సైతం మోదీ గండి కొట్టాడని, విదేశాల్లోని నల్లధనం వెలికి తీస్తామని, పేదల అకౌంట్లు తెరుచుకోవాలని, తలా రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ప్రజలను మభ్య పెట్టాడని కేటీఆర్ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు పాల్గొన్నారు.