రాష్ట్రీయం

మార్కెట్ కుదేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ స్టాక్ మార్కెట్‌లో హాహాకారాలు చెలరేగాయి. మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూడటంతో భారీగా ఇనె్వస్టర్ల సంపద హరించుకు పోయింది. ఈక్విటీ మార్కెట్‌లో గురువారం అమ్మకాల వత్తిడి పెరగడంతో ఊగిలసాడిన సెనె్సక్స్ ఒక దశలో వెయ్యి పాయింట్ల పతనానికి చేరుకుని చివరికి 759 పాయింట్లు నష్టపోయంది. సెనె్సక్స్ పతనం కారణంగా వివిధ రంగాలకు చెందిన కంపెనీలు భారీగా నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచ వ్యాప్తంగా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ ఈ పతన పరంపర కొనసాగడంతో దాని ప్రభావం భారత మార్కెట్లపైనా తీవ్రంగానే పడింది. పపంచ వాణిజ్య రంగంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిణమాలే మార్కెట్ ఒడిదుడుకులకు కారణమయ్యాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో మార్కెట్ పతనానికి దేశీయ అంశాలే కారణమైనా తాజా అలజడికి మాత్రం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతికూల వ్యాఖ్యలతో పాటు ఆసియా మార్కెట్లు కుదేలు కావడమేనని అంటున్నారు.