రాష్ట్రీయం

‘హోదా’ మా పరిధిలో లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంశం తమ పరిధిలోనిది కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ నంద్ కిషోర్ సింగ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్థిక సంఘం సభ్యులు సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో చైర్మన్ సింగ్ మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హాదాను 14వ ఆర్థిక సంఘం అడ్డుకుందని చెప్పడం అవాస్తమని వ్యాఖ్యానించారు. అది రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తూ పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామన్నారు. బుధవారం కొన్ని పంచాయతీలను, ఆరోగ్య కేంద్రాలను సందర్శించామన్నారు. ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను పూర్తిగా చర్చించామన్నారు. రాష్ట్రంలోని సమస్యలను, సమస్యల తీవ్రతను ముఖ్యమంత్రి వివరించారన్నారు. విభజన నేపథ్యం, ఆర్థిక లోటు, ప్రస్తుత పరిస్థితులు, విభజన చట్టంలోని హామీలు, పోలవరం ప్రాజక్టు, అమరావతి నిర్మాణం తదితర విషయాలను వివరించారన్నారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేయాలని కోరారన్నారు. ఆర్థిక సంఘాల నివేదికలకు 1971 జనాభా ప్రాతిపదిక కావాలని తెలిపారన్నారు. విభజన నేపథ్యంలో ఏపీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం, వృద్ధి రేటు, నీటి వనరులకు ప్రాధాన్యత, నదుల అనుసంధానం,
పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలను ప్రస్తావించి, ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసించారు. వ్యవసాయ ఉత్పత్తుల్లో రాష్ట్రం పురోగతి సాధిస్తున్నట్లు తెలిపారు. ఐటిలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారన్నారు. ముఖ్యమంత్రి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని అవకాశం ఉన్నంత మేరకు ఏపీకి న్యాయం చేస్తామని చెప్పారు. ఏపీకి తగిన విధంగా సహాయం చేసేందుకు కమిషన్ సిద్ధంగా ఉందన్నారు. రాష్టప్రతి జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి విశే్లషించడమే కమిషన్ పని అని వివరించారు. ప్రత్యేక హాదాకు, కమిషన్‌కు సంబందం లేదన్నారు. అది జాతీయ అభివృద్ధి మండలి పరిధిలోనిదన్నారు. తాము 29 రాష్ట్రాల్లో పర్యటించి పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు. ఇప్పటి వరకూ 12 రాష్ట్రాల్లో పర్యటించామని, మిగిలిన రాష్ట్రాల్లో కూడా పర్యటనలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేస్తామన్నారు. జనాభా లెక్కల విషయంలో రాష్టప్రతి నోటిఫికేషన్‌కు అనుగుణంగా దానికి కట్టుబడి పని చేస్తామన్నారు. రాష్ట్ర విభజన సమయంలో తాను రాజ్యసభలో ఏపీకి మద్దతుగా మాట్లాడానని గుర్తు చేశారు. అయినప్పటికీ, కమిషన్ పరిధిలో మాత్రమే పని చేయాల్సి ఉంటుందన్నారు. తమ పరిధిలో ఉన్న అంశాలనే పరిగణలోకి తీసుకుంటామన్నారు. రాష్ట్ర విభజన ఏ పరిస్థితుల్లో జరిగింది? ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటోంది? తదితర అంశాలను గమనంలోకి తీసుకుని సానుకూల దృక్పథంతో ఆర్థిక సంఘం వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ పార్టీలతో కూడా చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు అశోక్ లాహిరి, అనూప్ సింగ్, రమేష్ చంద్, తదితరులు పాల్గొన్నారు.