రాష్ట్రీయం

నిద్ర లేకుండా గడిపిన సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 11: తిత్లీ తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రంతా నిద్ర లేకుండా గడిపారు. ప్రతి రెండు గంటలకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగంతో టెలీ కాన్ఫరెన్సు ద్వారా పరిస్థితిని సమీక్షించి, చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో బుధవారం రాత్రి 9 గంటలకు, 11 గంటలకు, అర్ధరాత్రి 1 గంటకు, గురువారం తెల్లవారుజామున 4 గంటలకు, ఉదయం 6.30 గంటలకూ టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి అధికార యంత్రాగానికి దిశానిర్దేశం చేశారు. ఆస్తి, ప్రాణనష్టాన్ని వీలైనంత వరకూ నివారించడమే లక్ష్యంగా ఆయన నిద్రను పక్కనపెట్టి పని చేశారు. తుపాను సహాయ
చర్యలను పర్యవేక్షించేందుకు వెలగపూడి సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్‌కు ఆర్ధరాత్రి సమయంలో సైతం ముఖ్యమంత్రి రావడం ఆధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. అవసరమైతే తానే రంగంలోకి దిగుతానని, తనను సంప్రదించడంలో అలసత్వం వద్దంటూ ముఖ్యమంత్రి సూచించారు. తిత్లీ తుపాను ప్రభావం నుంచి ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ వహించారు. రాత్రి 1 గంటకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్సులో సీఎం మాట్లాడుతూ తుపాను తీరం దాటే సమయంలో తీవ్రతను అంచనా వేయడమే కాదు, దాని ప్రభావం ప్రజలపై పడకుండా కాపాడటంలోనే మన సమర్థత ఆధారపడి ఉంటుందంటూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తుపాను తీవ్రతను నివారించడం సాధ్యం కాకపోయినా, నష్టనివారణకు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. తుపాను ప్రభావాన్ని పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తులను చేయడం అవసరమన్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో, క్షేత్ర స్థాయి అధికారులతో టెలీ కాన్ఫరెన్సు నిర్వహించారు. తుపాను తీరం దాటిన తరువాత తదుపరి పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలను ఇళ్ల నుంచి బయటకు రాకుండా హెచ్చరికలు చేయాలని ఆదేశించారు. వాహనాలల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు వహించాలన్నారు. వర్షానికి రేకుల షెడ్లు ఎగిరిపోయి నిర్వాసితులైన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండాలని, సంక్షిప్త సందేశాలు పంపాలన్నారు. ఏ పనులు చేయవచ్చో, ఏ పనులు చేయకూడదో చెప్పాలన్నారు.

ప్రకృతి సృష్టించిన విపత్తు
తిత్లీ తుపాను ప్రకృతి సృష్టించిన విపత్తుగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఈ సమయంలోనే బాధితులకు అండగా ఉండాలన్నారు. వారికి భరోసా కల్పించాలని సూచించారు. విపత్తులు రాకుండా ఆపలేమని, కానీ విపత్తు నష్టాన్ని తగ్గించలగమన్నారు. కష్టాల్లో ఉన్నవారికి చేసిన సేవే శాశ్వతంగా గుర్తు ఉంటుందన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, బాధితులకు అందరూ అండగా ఉండాలన్నారు. ఆహారం, మంచినీటిని సరఫరా చేయాలన్నారు. తుపాను బాధితులను ఆదుకోవడమే తమ లక్ష్యమన్నారు. సకాలంలో స్పందించి ఆదుకోవాలని, ఎటువంటి ప్రాణనష్టం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తీరం దాటే సమయంలోని నాలుగు గంటలూ అత్యంత కీలకమని తెలిపారు. అధికారులు రాత్రింబవళ్లు పనిచేశారని, ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు. వర్షం తెరపి ఇవ్వగానే క్షేత్ర స్థాయి సహాయక చర్యల్లో పాల్గొనాలన్నారు.