రాష్ట్రీయం

చల్లావారిపల్లిలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, అక్టోబర్ 11: చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం చల్లావారిపల్లి ఎస్సీ కాలనీ వీధిలో గురువారం మధ్యాహ్న సమయంలో సేదతీరుతున్న నలుగురు వృద్ధులపైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు వృద్ధులకు తీవ్రగాయాలైనట్లు కల్లూరు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు తెలిపారు. ఎస్‌ఐ విశ్వనాధనాయుడు తెలిపిన వివరాల మేరకు... చల్లావారిపల్లి ఎస్సీకాలనీకి చెందిన మునీశ్వర్ కుమార్తెకు గురువారం నామకరణం కార్యక్రమం సందర్భంగా మునీశ్వర్ ఇంటికి బంధువులు చేరుకొని వేడుకలో నిమగ్నమయ్యారు. ఈ నామకరణం కార్యానికి మునీశ్వర్ బంధువైన వాల్మీకిపురానికి చెందిన మురళీధర్‌మూర్తి తన కారులో చల్లావారిపల్లికి వచ్చాడు. నామకరణం కార్యక్రమం పూర్తికాగా వీధిలో ఇంటి ముందు ఉన్న మురళీధర్‌మూర్తి కారును పక్కన పెట్టేందుకు మునీశ్వర్ తమ్ముడు మునిరాజ కారును ముందుకుపోనిచ్చాడు. కారు అదుపుతప్పడంతో అదే వీధిలో మధ్యాహ్న సమయంలో సేదతీరుతున్న నలుగురు వృద్ధులపై దూసుకెళ్లడంతో చల్లావారిపల్లికి చెందిన లక్ష్మమ్మ (75), రాజమ్మ (70) అక్కడికక్కడే మృతి చెందగా చెంగమ్మ, మొగిలమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు 108 వాహనానికి, కల్లూరు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్రగాయాలైన ఇద్దరు వృద్దులను చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని, ప్రమాదానికి కారకులైన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ విశ్వనాధనాయుడు తెలిపారు.