రాష్ట్రీయం

కాంగ్రెస్ పార్టీకి నాదెండ్ల మనోహర్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం ఈ మేరకు రాజీనామా పత్రాన్ని రాహుల్‌గాంధీకి పంపారు. మరో ఆరేడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనోహర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఆ పార్టీకి షాక్‌నిచ్చింది. శుక్రవారం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో అధికారికంగా నాదెండ్ల చేరనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. బుధవారం గుంటూరు నుంచి పవన్‌ను కలిసేందుకు మనోహర్ తిరుపతి బయలుదేరి వెళ్లారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో పవన్‌ను కలుసుకున్నారు. శుక్రవారం ఇరువురు స్వామివారిని దర్శించుకున్న అనంతరం మనోహర్ జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఇలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి పుంజుకుందామని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు నాదెండ్ల మనోహర్ రాజీనామా చేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. రెండుసార్లు తెనాలి ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా పనిచేసిన నాదెండ్ల మనోహర్‌కు క్లీన్ ఇమేజ్ ఉండటంతో పాటు, అపార అనుభవం, యువత ఫాలోయింగ్ అధికంగా ఉండటంతో దానిని సానుకూలంగా మలుచుకుందామన్న ఆలోచనలో కాంగ్రెస్ ఉండగా, మనోహర్ నిర్ణయం అశనిపాతంగా తగిలింది. మనోహర్ 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి నుంచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి గెలిచారు. 2011 జూన్‌లో స్పీకర్ పదవిని చేపట్టిన నాదెండ్ల రాష్ట్ర విభజన జరిగే వరకు ఆ పదవిలో కొనసాగారు. 2014 ఎన్నికల్లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ ఏడాది జూన్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆశ్చర్యపర్చారు. అప్పుడే ఆయన పార్టీ మారతారనే చర్చ కొనసాగినప్పటికీ వివిధ కారణాల రీత్యా అప్పట్లో కాంగ్రెస్‌ను వీడలేదు. మొత్తానికి జనసేనలో చేరుతున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరిగి తెనాలి నుంచే పోటీచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.