రాష్ట్రీయం

బ్రహ్మచారిణిగా భ్రమరాంబ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, అక్టోబర్ 11: శ్రీశైలంలో జరుగుతున్న శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం భ్రమరాంబిక అమ్మవారు బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి స్వామి, అమ్మవార్లకు మయూరవాహన సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులు పూజించారు. నవదుర్గల్లో రెండవ రూపమైన బ్రహ్మచారిణిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలగడంతోపాటు సర్వత్రా విజయాలు లభిస్తాయి. బ్రహ్మచారిణి ఉపాసన ద్వారా త్యాగ, వైరాగ్య భావాలుకలుగుతాయని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ స్వరూపాన్ని సిద్ధులు, యతులు ఎక్కువగా ఉపాసిస్తారు. రెండు చేతులతో దర్శనమిచ్చిన దేవి కుడిచేతిలో జపమాల, ఎదమచేతిలో కమండలాన్ని ధరించి ఉంటుంది. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక అమ్మవార్లను అందంగా అలంకరించి మయూర వాహనంపై ఆశీనులను జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయ వీధుల్లో గ్రామోత్సవం కన్నులపండువగా జరిగింది. గ్రామోత్సవం ముందు వివిధ కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి.