రాష్ట్రీయం

చిన్నశేష, హంస వాహనాలపై మలయప్ప చిద్విలాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, అక్టోబర్ 11: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన గురువారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఐదుతలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అవతారంలో, రాత్రి హంస వాహనంపై జ్ఞానమూర్తిగా మలయప్ప భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భాగాన గజరాజులు, అశ్వాలు ఠీవిగా నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్క్భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాలు, డ్రమ్స్ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనలు నడుమ స్వామివారి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచ భౌతికప్రకృతికి సంకేతం.
ఈ వాహనం పంచ భూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కనిపించే శ్రీవారి ప్రకృతి. విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమైన దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరించాడు. పంచ శిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయఃప్రదం. శేషవాహనోత్సవాన్ని దర్శిస్తే దుష్టశక్తుల వల్ల కలిగే దుష్పలితాలు తొలగి, భక్తులు కుండలినీయోగం సిద్ధించి, సుఖ శాంతులతో ఆనందజీవులవుతారని భక్తుల నమ్మకం.
గురువారం రాత్రి హంస వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామివారు జ్ఞానమూర్తిగా ప్రకాశించారు. ఐతిహ్యానుసారం బ్రహ్మ వాహనమైన హంస జ్ఞానానికి ప్రతీక. పాలను, నీళ్లను వేరుచేసే విచక్షణ దీని స్వభావం. ఇది ఆత్మానాత్మ వివేకానికి సూచకం. అందుకే ఉపనిషత్తులు పరమాత్మతో సంయోగం చెందిన మహనీయులను పరమహంసగా అభివర్ణిస్తున్నాయి. శ్రీవారు భక్తులలో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకు హంస వాహనాన్ని అధిరోహిస్తాడని పురాణాలు ఘోషిస్తున్నాయి. వాహన సేవలో పెద్దజీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ ఈ ఓ అనిల్‌కుమార్ సింఘాల్, ఇన్చార్జ్ సీవీ ఎస్వో శివకుమార్ రెడ్డి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.