రాష్ట్రీయం

డెడ్లీ తిత్లీతో రైళ్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన డెడ్లీ తిత్లీ తుపానుతో గురువారం మరిన్ని రైళ్లు రద్దయ్యాయి. రెండోరోజు 17 రైళ్లు రద్దు కాగా మరికొన్ని పాక్షికంగాను, ఇంకొన్ని రీ-షెడ్యూల్ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో పలు రైల్వేస్టేషన్లు దెబ్బతినగా, విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. హైదరాబాద్, విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళే బస్సు సర్వీసులు విశాఖపట్నంతో నిలిచిపోయాయి.
రద్దయిన రైళ్లు
ఎర్నాకులం-హటియా ఎక్స్‌ప్రెస్ (22838) ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దయ్యింది. హటియాలో ఇది గరువారం బయలుదేరాల్సి ఉంది.
యశ్వంత్‌పూర్-హౌరా ఎక్స్‌ప్రెస్ (12864)ను రద్దు చేశారు. యశ్వంత్‌పూర్‌లో బుధవారం ఇది బయలుదేరాల్సి ఉంది.
బెంగళూరు-గౌహతి ఎక్స్‌ప్రెస్ (12509) రద్దయ్యింది. బెంగళూరులో బుధవారం ఇది బయలుదేరాల్సి ఉంది.
యశ్వంత్‌పూర్-ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (15227) బుధవారం రద్దయ్యింది. ఇది యశ్వంత్‌పూర్‌లో బుధవారం బయలుదేరాలి.
విశాఖపట్నం-పలాస పాసింజర్ (58526) రద్దయ్యింది. ఇది విశాఖపట్నంలో గురువారం బయలుదేరాల్సి ఉంది.
విశాఖపట్నం-్భవనేశ్వర్-విశాఖపట్నం (22819/22820) ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దయ్యింది.
విశాఖపట్నం-దిగా ఎక్స్‌ప్రెస్ (22874) గురువారం రద్దయ్యింది. ఇది విశాఖపట్నం బయలుదేరాల్సి ఉంది.
చంద్రగాఛీ-చెన్నై (06057) ప్రత్యేక రైలు చంత్రగాఛీలో గురువారం బయలుదేరాల్సి ఉండగా దీనిని రద్దు చేశారు.
హౌరా-చెన్నై (12841) కోరమండల్ ఎక్స్‌ప్రెస్ హౌరాలో శుక్రవారం బయలుదేరాల్సి ఉండగా ఇది రద్దయ్యింది.
హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12863) హౌరా నుంచి శుక్రవారం బయలుదేరాలి. దీనిని రద్దు చేశారు.
బెంగళూరు-్భవనేశ్వర్ (18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ శుక్రవారం బెంగళూరులో బయలుదేరాలి. దీనిని రద్దు చేయడం జరిగింది.
యశ్వంత్‌పూర్-్భగల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12253) ఈ నెల 13వ తేదీన యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరాలి. అయితే దీనిని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు.
హౌరా-హైదరాబాద్ (18645) ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ గురువారం రద్దయ్యింది. ఇది హౌరాలో బయలుదేరాలి.
పాక్షికంగా రద్దయిన మరికొన్ని రైళ్ళు
విశాఖపట్నం-గుణుపూర్ (58506) పాసింజర్ విశాఖపట్నం నుంచి గురువారం బయలుదేరాలి. అయితే దీనిని విజయనగరం వరకే నిర్వహిస్తున్నారు. విజయనగరం నుంచి తిరిగి విశాఖపట్నం చేరుకుంటుంది.
విశాఖపట్నం-న్యూ పలాస (67294) విశాఖపట్నంలో గురువారం బయలుదేరాల్సి ఉండగా దీనిని పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. దీనిని కూడా విజయనగరం వరకే నిర్వహిస్తున్నారు. ఇది విజయనగరం-విశాఖపట్నం మధ్య నడుస్తుంది.
మళ్ళింపులో...
హౌరా-సికింద్రాబాద్ (12703) ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ హౌరాలో గురువారం బయలుదేరుతుంది.
హౌరా-చెన్నై (12839) చెన్నై సెంట్రల్ మెయిల్ హౌరాలో ఈ నెల 10వ తేదీన బయలుదేరాల్సి ఉండగా దీనిని రీ షెడ్యూల్ చేయడంతో యధావిధిగా సాధారణ మార్గంలోను నిర్వహిస్తుండగా ఇది గురువారం ఉదయం 8గంటలకు అక్కడ బయలుదేరింది.
షాలిమార్-త్రివేండ్రం (12660) షాలిమార్‌లో ఈ నెల 10న బయలుదేరాలి. రీ షెడ్యూల్ చేయబడటంతో గురువారం ఉదయం 8.15గంటలకు సాధారణ మార్గంలోనే దీనిని నిర్వహిస్తున్నారు.
హౌరా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12863) హౌరాలో గురువారం యదావిధిగా పాత మార్గంలోనే నడుస్తోంది.
కామాక్యా-యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12552) కామాక్యా నుంచి ఈ నెల 10వ తేదీన యదావిధిగా బయలుదేరింది.
భారీగా దెబ్బతిన్న స్టేషన్ భవనాలు
పలాస తదితర రైల్వేస్టేషన్ల భవనాలు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జిలు, సిగ్నలింగ్ స్తంభాలు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది.
చిత్రం..విశాఖ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న దృశ్యం