రాష్ట్రీయం

సోమశిలకు భారీగా బ్యాక్‌వాటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, డిసెంబర్ 1: గత రెండురోజులుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల ప్రాజెక్టుకు పెద్దఎత్తున నీరు చేరి 68 టిఎంసిల నీరు నిల్వఉంచడంతో బ్యాక్‌వాటర్‌లో వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అంతకుముందు వారంరోజులు కురిసిన వర్షాలకు 64టిఎంసిల నీరును నిల్వచేయగా, ప్రస్తుతం 68 టిఎంసిలకు చేరింది. దీంతో గోపవరం మండలం సూర్యపల్లె దళితవాడ, బ్రాహ్మణపల్లె దళితవాడ ముంపువాసులను రెవెన్యూ అధికారులు బ్రాహ్మణపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు తరలించారు. బ్యాక్‌వాటర్ వద్ద పలువురు జాలర్లు చేపలు పడుతున్నారు. సోమశిల ముంపువాసులు తమకు పూర్తిస్థాయి పరిహారం ఇస్తే తప్ప గ్రామాలు వదలబోమని మొండికేసి గ్రామాల్లోనే తిష్టవేసుకుని కూర్చున్నారు. ఒంటిమిట్ట మండలం బందారుపల్లెలో బ్యాక్‌వాటర్ ప్రవేశించింది. అలాగే సిద్దవటం మండలంలో వెలుగుపల్లి, కంబపాలెం, జంగాలపల్లెకు నీరు చేరింది. అట్లూరు మండలం వరికుంటపల్లె, జాఫర్ సాహెబ్‌పల్లె, అట్లూరు ప్రాంతాలకు నీరు చేరింది. గోపవరం మండలం కుంభగిరి, ఒంటిమిట్టమండలం గొల్లపల్లె, దర్జిపల్లె, బందారుపల్లె, నందలూరు మండలం దుగ్గాయపల్లె, కొడమలూరు, పొత్తపి, అంకాలమ్మ గుడి తదితర ప్రాంతాల్లో పొలాలన్నీ సోమశిల బ్యాక్‌వాటర్‌తో మునగడమేగాక నీరు గ్రామాల్లోకి ప్రవేశించింది. సోమశిల ప్రాజెక్టును 75 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. గతంలో ఎన్నడూ 62, 64 టిఎంసిలకు మించి నీటిని ఈ ప్రాజెక్ట్‌లో నిల్వచేయలేదు. ప్రస్తుతం నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు రైల్వేకోడూరు, రాజంపేటలో భారీ వర్షాలు కురవడంతో వరదనీరు పెద్దఎత్తున సోమశిలప్రాజెక్టుకు చేరడంతో సోమశిలలో బ్యాక్‌వాటర్ ఉద్ధృతమైంది. దీంతో కడపజిల్లాలోని 100గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదమేర్పడింది. తమకు పూర్తిస్థాయి పరిహారం, ఇంటికో ఉద్యోగం ఇస్తే తప్ప కదిలేది లేదని ముంపుగ్రామాల వాసులు మొరాయిస్తున్నారు. అధికారులు టాంటాం వేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అన్ని ప్రాంతాలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని పదే పదే చెప్పినా ముంపువాసులు పెడచెవిన పెడుతున్నారు.

విశాఖ పోలీసుల ట్రాఫిక్ వెబ్‌సైట్ హ్యాక్

విశాఖపట్నం, డిసెంబర్ 1: విశాఖ నగర ట్రాఫిక్ పోలీస్‌లకు సంబంధించిన వెబ్‌సైట్ హ్యాక్ కావడంతో పోలీస్ అధికారులు ఉలిక్కిపడ్డారు. విశాఖ నగరంలో ఎప్పుడూ ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. అందులోనూ పోలీస్ వెబైసైట్ హ్యాక్ కావడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య సుమారు నాలుగు గంటలపాటు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసినట్టు పోలీస్ అధికారులు ధృవీకరించారు. అయితే ఈ వెబ్‌సైట్‌లో రహస్య సమాచారం ఏమీ లేదని ట్రాఫిక్ ఎడిసిపి మహేంద్ర పాత్రుడు స్పష్టం చేశారు. హ్యాకింగ్‌పై దర్యాప్తు బాధ్యతను సైబర్ క్రైం పోలీసులకు అప్పగించామని ఆయన తెలియచేశారు. ఈ విషయమై నగర పోలీస్ కమిషనర్ అమిత్ గార్గ్ మాట్లాడుతూ దీనిపై దర్యాప్తు జరిపేందుకు ప్రత్యేక అధికారులను రప్పిస్తున్నామని చెప్పారు.

రూ.కోటి ఎర్రచందనం స్వాధీనం
చాగలమర్రి, డిసెంబర్ 1: కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి గ్రామం వద్ద పోలీసులు, అటవీశాఖ సిబ్బంది రూ.కోటి విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్న 14 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నారు. 70 దుంగలనుతరలిస్తుండగా కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ దేవదానం తెలిపారు.