రాష్ట్రీయం

పిచ్చుకలంక నుండి ధవళేశ్వరం వరకు ‘జన’కవాతు నేడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 14: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజీపై సోమవారం కవాతు నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా విజ్జేశ్వరం నుండి వచ్చే జనసైన్యం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం పిచ్చుకలంక నుండి ధవళేశ్వరం కాటన్ విగ్రహం జంక్షన్ వరకు రెండున్నర కిలోమీటర్ల మేర బ్యారేజిపై కవాతు జరుగుతుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం నెరవేర్చకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఈ కవాతు నిర్వహిస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా కవాతు నిర్వహించాలని అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో జనసేన శ్రేణులు ఏర్పాట్లకు నడుంబిగించాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచే మార్పు కోసం శ్రీకారం చుడుతూ రాజకీయ ప్రత్యామ్నాయం సంకేతంగా ఈ కవాతు నిర్వహించాలని తలపెట్టారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి సుమారు రెండు లక్షల మంది ఈ కవాతుకు హాజరవుతారని పార్టీ వర్గాలు అంచనావేస్తున్నాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కవాతు ప్రారంభమై 4.30 గంటలకు ముగుస్తుంది. సుమారు వెయ్యి మంది వీర మహిళలు సంప్రదాయ బద్ధంగా పవన్‌కు స్వాగతం పలుకుతారు. కవాతును నిర్వహించడానికి పార్టీకి చెందిన ఆజాద్ యూత్ శిక్షణ తీసుకున్నారు. కవాతు మొదలు పెట్టే ప్రాంతమైన పిచ్చుకలంక వద్ద భారీ శిబిరాలు ఏర్పాటు చేసి గత కొద్ది రోజులుగా కవాతుకు శిక్షణ ఇస్తున్నారు. కవాతు అనంతరం పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం కాటన్ విగ్రహం జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇక్కడ పది అడుగుల ఎత్తులో భారీ సభా వేదికను ఏర్పాటుచేశారు. దూరం నుంచి కూడా వీక్షించడానికి వీలుగా వీలుగా మొత్తం 25 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటుచేశారు. మొత్తం కవాతును డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నారు.
ఈ కవాతులో పవన్ కళ్యాణ్ వెంట ముందు వరసలో వెయ్యి మంది రైతులు, వెయ్యి మంది చేనేత కార్మికులు, వెయ్యి మంది మత్య్సకారులు, వెయ్యి మంది గీత కార్మికులు తమ తమ వృత్తి పరికరాలు, ఆహార్యంతో సామాజిక దర్పణంగా దర్శనమిస్తారు. గోదావరి నదిలో బ్యారేజికి ఇరువైపులా నావలపై వెయ్యి మంది గజ ఈతగాళ్ళను నియమించారు. గోదావరి లంకలపై కూడా జెండాలతో అలంకరించారు. పిచ్చుకలంక నుంచి విజ్జేశ్వరం వరకు జనసైనికులతో మొత్తం నిండిపోనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. బైక్, కార్ల పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. పోలీసు, అనుబంధ అన్ని శాఖల అధికారుల నుంచి అనుమతులు తీసుకున్నామని పార్టీ నాయకులు చెప్పారు. కాటన్ బ్యారేజిపై విజ్జేశ్వరం నుంచి మొదలుకొని పర్యటన సాగే 16వ నెంబర్ జాతీయ రహదారిపై మోరంపూడి జంక్షన్ వరకు అభిమానులు, నాయకులు ప్లెక్సీలు, జెండాలతో అలంకరించారు. ఒక వైపు గోదావరి అందాల అంచున కాటన్ బ్యారేజి బ్రిడ్జిపై కవాతు జన ప్రవాహం ఒక చారిత్రాత్మక ఘట్టంగా సాగాలని నేతలు ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేశారు. పవన్ టూర్ ఇన్‌చార్జి మాజీ ఎమ్మెల్సీ కందుల లక్ష్మీదుర్గేష్, జిల్లా కో ఆర్డినేటర్ మేడా గురుదత్త ప్రసాద్, నాయకులు అత్తి సత్యనారాయణ, పంతం నానాజీ, గంటా స్వరూపా, కొల్లివెలసి హారిక, వై శ్రీనివాస్ తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
మధ్యాహ్నం మూడు గంటలకు మొదలై కవాతు నాలుగ్నుర గంటలకు ముగుస్తుందని, అనంతరం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని టూర్ ఇన్‌చార్జి కందుల దుర్గేష్ చెప్పారు. ప్రసంగం పూర్తయ్యాక రాజమహేంద్రవరం ఐఎల్‌టీడీ జంక్షన్, రైల్వే స్టేషన్, కోటిపల్లి బస్టాండ్, కారల్ మార్క్స్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్సు రోడ్డు మీదుగా మోరంపూడి జంక్షన్ వరకు పవన్ యాత్ర సాగనుంది. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడ వెళతారు.
జనసేన కవాతు నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుండే కాటన్ బ్యారేజీపై ట్రాఫిక్ రద్దీ మొదలయ్యింది. ట్రాఫిక్ మళ్ళింపు నిమిత్తం పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సోమవారం మధ్యాహ్నం పనె్నండు గంటల నుంచి రాత్రి వరకు బ్యారేజి రోడ్డు నుంచి ధవళేశ్వరం వరకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పేట్టులేదు.